టాలీవుడ్ లో సినిమాలు రీమేక్ చేయడం కొత్త ఆనవాయితేం కాదు. ఎప్పటి నుంచీ చేస్తున్నారు సూపర్ హిట్స్ ని అందుకుంటున్నారు. అయితే ఒక భాషలో సుపర్ హిట్ అయిన సినిమాని మళ్ళీ ఇంకో భాషలో రీమేక్ చేసి హిట్ అందుకోవడం అందరివల్లా కాదు. శంకర్ లాంటి దర్శకుడు '3 ఇడియట్స్' లాంటి అద్భుతమైన కథను రీమేక్ చేయడంలో తప్పు చేశాడు. దాంతో ఫ్లాప్ నెత్తిమీద పెట్టుకున్నారు. ఇక ఇలా రీమేక్ లు చెయ్యడంలో కొందరు దర్శకులు మాత్రం స్పెషలిస్టులు ఉన్నారు. ఒరిజినల్ సినిమా సోల్ ను మాత్రమే తీసుకుని ఆ సోల్ ని ట్రెండీగా మార్చి హీరో ఇమేజ్ కి కొత్త టచ్ ఇస్తూ ప్రేక్షకులను మెప్పించగలిగే వాళ్ళు. 

 

హరీష్ శంకర్ అలాంటి జాబితాలోనే ఉంటారని గబ్బర్ సింగ్, గద్దల కొండ గణేష్ సినిమాలని చూసి అర్థం చేసుకోవచ్చు. ఎన్నో లిమిటేషన్స్ ఉన్నప్పటికీ 'ప్రేమమ్' రీమేక్ ను అద్భుతంగా హ్యాండిల్ చేశారని చందూ మొండేటి కూడా ప్రశంసలు దక్కుతూ ఉంటాయి. ఇక 'అర్జున్ రెడ్డి' రీమేక్ ను హిందీలో తెలుగు కంటే పెద్ద హిట్ గా రూపొందించారు సందీప్ రెడ్డి వంగా.  అయితే '96' దర్శకుడు ప్రేమ్ కుమార్ మాత్రం తెలుగు రీమేక్ 'జాను' తో మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. ఈ సినిమా నిజానికి తమిళ ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా ఉండడంతో అక్కడ సూపర్ హిట్ అయింది. త్రిషకి కం బ్యాక్ మూవీగా మంచి కిక్ ఇచ్చింది. అంతేకాదు విజయ్ సేతుపతికి మంచి క్రేజ్ ని తీసుకు వచ్చింది. అందుకే దిల్ రాజు ఈ సినిమాను తెలుగులో రిమేక్ చేశాడు. 

 

'96' దర్శకుడు ప్రేమ్ కుమార్ కే తెలుగు రీమేక్ బాధ్యతలు అప్పగించారు. అయితే తెలుగు వెర్షన్ కు కొన్ని మార్పులు సూచించారట దిల్ రాజు. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్లను కలపాలని.. స్లో గా ఉన్న నరేషన్ ను మారుద్దామని చెప్పారట. కానీ ప్రేమ్ కుమార్ తమిళ వెర్షన్ మీద ఉన్న నమ్మకం తోనే తెలుగులో యదా తధంగా దింపాడట. దాంతో రిజల్ట్ బెడిసి కొట్టింది. ప్రేక్షకులు ఒక్క షో పడగానే పెదవి విరిచారు. ప్రేమ్ కుమార్ సబ్జెక్ట్ బావున్నప్పటికి ప్రేక్షకుల అభిరుచులు.. నేటివిటీ లాంటి కొన్ని అంశాలను లెక్కపెట్టకపోవడంతో సూపర్ హిట్ గా నిలవాల్సిన సినిమా ఇప్పుడు ఫ్లాప్ అని అంటున్నారు. అనడం కాదు ఫ్లాప్ గా మిగిలింది అని డిసైడయ్యారు కూడా. మొత్తానికి ఈ తప్పు దర్శకుడి మీద పడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: