టాలీవుడ్ వన్ ఆఫ్ ది టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన ఏ సినిమా తీసిన నీట్ గా తీస్తారు. ముందు ఫ్యామిలీ ఆడియన్స్ థియోటర్స్ కి రావడమే ఆయన గోల్. ఆ దిశగానే ఆయన కథలని సెలెక్ట్ చేసి చక్కగా తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. దిల్ రాజు అంటే దిల్ ఉన్న రాజు అన్న పేరుని ఇండస్ట్రీలో సంపాదించుకున్నారు. ఆయన పరిచయం చేసిన దర్శకులందరు బాగా సెటిలయ్యారు. ఇది నిజంగా రాజుగారి గొప్పదనమే అని చెప్పాలి. టాలీవుడ్ లో ఏ నిర్మాతా కొత్త దర్శకులని ఎంకరేజ్ చేయని విధంగా దిల్ రాజు ఎంకరేజ్ చేస్తారు. అందుకే దర్శకులందరికి దిల్ రాజు దేవుడు అంటారు. బోయపాటి శ్రీను, వంశీ పైడిపల్లి సతీష్ వేగేశ్న, సుకుమార్ ఇలా చెప్పుకుంటూ పోతే దిల్ రాజు కాంపౌండ్ లో పెరిగి ఈ రోజు స్టార్ డైరెక్టర్స్ గా కోట్లలో రెమ్యూనరేషన్ అందుకుంటున్న వాళ్ళ లిస్ట్ చాలా పెద్దదే. 

 

ఇక క్వాలిటీ విషయంలో కూడా రాజు గారు కాంప్రమైజ్ కారు. అలా అని బడ్జెట్ లిమిట్ దాటకుండా జాగ్రత్త పడతారు. అందుకే టాలీవుడ్ లో నంబర్ వన్ ప్రొడ్యూసర్ గా పేరు సాధించారు. ఇక టాలీవుడ్ లో ఉన్న అందరికి రాజు గారంటే విపరీతమైన అభిమానం. ప్రస్తుతం తన కల నెరవేర్చుకుంటున్నారు దిల్ రాజు. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఎపాటినుంచో ఒక సినిమా చేయాలని. అది ఇన్నాళ్ళకి కార్యరూపం దాల్చి సెట్స్ మీద ఉంది. ఒకరకంగా ఈ ప్రాజెక్ట్ దిల్ రాజుకి పెద్ద టెన్షన్ అనే చెప్పాలి. ఇప్పటికే పవన్ తో నిర్మిస్తున్న సినిమాని బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ పింక్ గా తెరకెక్కించి సూపర్ హిట్ ని సొంతం చేసుకుంది. ఇక ఇదే సినిమాని కోలీవుడ్ లోను అజిత్ తో రూపొందించగా అక్కడ కూడా పెద్ద సక్సస్ గా నిలిచింది.

 

అయితే ఇప్పుడు తెలుగులో ఈ సినిమా ఎంతవరకు సక్సస్ అవుతుందో అన్నదే దిల్ రాజు టెన్షన్. ఇప్పటికే ఖర్చు తడిసి మోపెడవుతుందట. అందులో సమంత శర్వానంద్ తో తీసిన జాను కమర్షియల్ గా లాసే అన్న టాక్ వినిపిస్తుంది. ఈ మధ్య దిల్ రాజు కి ఒక్క హిట్ వస్తే వేనకనే వరుసగా నాలుగు ఫ్లాప్స్ పడుతున్నాయి. దాంతో మానసికంగా బాగా స్ట్రుగల్ అవుతూ కాస్త ఆరోగ్యం కూడా ఇబ్బంది పెడుతుందట. ఇక దిల్ రాజు భార్య కూడా చనిపోవడం తో ఆ వెలితి కూడా ఆయన్ని బాగా పీడిస్తుందట. అందుకే కూతురు అల్లుడు మిగతా కుటుంబ సభ్యులు రాజుగారిని పెళ్ళి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నారట. అయితే ఈ విషయం ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. అయితే ఈ వయసులో పెళ్ళి అన్నది కరెక్ట్ డెసిషనేనా అంటూ మాట్లాడుకుంటున్నారు. ఇదే విషయంలో రాజుగారు డైలమాలో పడి ఎటూ తేల్చుకోలేక ఉకిరిరి బిక్కిరి అవుతున్నాడట. ఒక్కసారిగా ఇలా సమస్యలన్ని దిల్ రాజుని చుట్టుముట్టడం నిజంగా బాధాకరం.

మరింత సమాచారం తెలుసుకోండి: