పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటల మాంత్రీకుడు తెరకెక్కించిన అజ్ఞాతవాసి సినిమా తర్వాత పూర్తిగా రాజకీయాలలో బిజీ అయిపోయారు. క్షణం తీరిక లేకుండా జనాలతోనే గడుపుతున్నారు. అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం మళ్ళీ సినిమాలు చేయమని ఒకటే ప్రాధేయపడుతున్నారు. అయినా పవన్ ఇక సినిమాలు చేయను. జనసేన పెట్టింది మీకోసమే ..జనాలకి సేవ చేయడం కోసమే అంటూ చెబుతూ వచ్చారు. అయితే ఉన్నపలంగా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి భయంకరమైన షాకిచ్చారు.

 

ఒకవైపు రాజకీయాలు మరో వైపు సినిమాలు ఒకేసారి సమర్ధవంతంగా నిర్వర్తిస్తున్నారు. ఒకప్పుడు నందమూరి తారక రామారావు లాగా అటు రాజాకీయలకి సంబందించిన చర్చలలో పాల్గొంటూనే సినిమాలకి సమయం కేటాయించారు. సంక్రాంతి తర్వాత సడన్ గా పింక్ సినిమా రీమేక్ సెట్ లో ప్రత్యక్షమయ్యి అందరికీ షాకిచ్చాడు పవన్ కళ్యాణ్. ఈ సినిమాకి లాయర్ సాబ్, వకీల్ సాబ్ అన్న టైటిల్స్ ని అనుకుంటున్నారట చిత్ర బృందం. అయితే అఫీషియల్ గా ఇంకా ఏ టైటిల్ ఫైనల్ చేస్తారన్నది ఇప్పుడు మెగా ఫ్యాన్స్ లో ఆతృతను పెంచుతోంది. 

 

ఇక ఈ సినిమాతో పాటే ఏ.ఎం.రత్నం నిర్మాతగా జాగర్ల మూడి krishna KUMAR' target='_blank' title='రాధా కృష్ణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రాధా కృష్ణ (క్రిష్) దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఈ సినిమా ప్రస్తుతం ఒక షెడ్యూల్ కంప్లీటయింది. పదిరోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్ లో పవన్ పాల్గొన్నారట. పీరియాడికల్ మూవీగా ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు ఏ.ఎం.రత్నం. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా పవన్ సరసన నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నప్పటికి ఇంకా చిత్ర యూనిట్ నుండి క్లారిటి రావాల్సి ఉంది.

 

అయితే ఈ సినిమా వీలైంత త్వరగా కంప్లీట్ చేసి నెక్స్ట్ సినిమాకి పవన్ ప్లాన్ చేసుకుంటున్నట్టు తాజా సమాచారం. ఆ సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తాడని ఫిల్మ్ నగర్ లో న్యూస్ బాగా వైరల్ అవుతోంది. ఈ కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ వచ్చి బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లో హైయ్యేస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రికార్డ్స్ ని క్రియోట్ చేసింది. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ సినిమాకి అఫీషియల్ రీమేక్ గా ఈ సినిమాని తెరకెక్కించారు హరీష్ శంకర్.

 

దాంతో హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ కాంబో అనగానే అంచనాలు భారీగా మొదలైయ్యాయి. ఇదిలా ఉంటే రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ నిర్మాతకి చిన్న వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. షూటింగ్ లో పవన్ ఉన్నంత సేపు ఆ నిర్మాత ఉండాలని గట్టిగా చెప్పాడట. ఇప్పటి వరకు జరిగిన షెడ్యూ లో ఒకటి రెండు రోజులు నిర్మాత లేకపోవడంతో పవన్ సీరియస్ అయ్యాడట. మరి అలా హీరో పక్కనే ఉండాలంటే కాస్త కష్టమే. మరి పవన్ మైండ్ సెట్ ఏమై ఉంటుందో.   

మరింత సమాచారం తెలుసుకోండి: