సినీ నటులు, దంపతులు రాజశేఖర్- జీవిత ప్రేమ వివాహం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. వాలంటైన్స్ డే సందర్భంగా వీరిరువురి బంధం గురించి తెలుసుకుందాం.. రాజశేఖర్ చదివింది మెడిసిన్ అయినా సినిమాల పై ఇష్టంతో ఈ రంగంలోకి వచ్చారు. ఈ క్రమంలో జీవితతో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. ఈ ఇద్దరూ తలంబ్రాలు చిత్రంలో తొలిసారి కలిసి నటించారు. ఇందులో రాజశేఖర్ నెగెటివ్ రోల్ చేయడం విశేషం. అయితే వ్యక్తిగతంగా నా తీరు అందుకు పూర్తిగా భిన్నం అంటున్నారు రాజశేఖర్. పెద్దగా అమ్మాయిలతో మాటాడేవాడిని కాను. అప్పటికే మెడిసిన్ కంప్లీట్ చేసి సినిమాలంటే ఇష్టం కొద్దీ తెరపైకి వచ్చాను. 

 

పెద్దలు కుదిర్చిన సంబంధమే చేసుకుంటానని ఇంట్లో వాళ్లకు చెప్పేశాను కూడా. అయితే అప్పటికే తాను ఏ హీరోయిన్ ని కూడా పెళ్లి చేసుకోవడానికి వీలు లేదని తమ ఇంట్లో చెప్పడం వల్ల రాజశేఖర్ ఈ బంధం గురించి ఆలోచించడానికి ఇష్టపడలేదు. రాజశేఖర్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోనే నటి శ్రీదేవితో పెళ్లి సంబంధం వస్తే, హీరోయిన్ తో పెళ్లి ఇష్టం లేక సంబంధం వదులుకున్నారట ఆయన తల్లిదండ్రులు. అయితే ఇదంతా తెలిసినా కూడా రాజశేఖర్ పట్ల ఏర్పడిన ప్రేమని జీవిత వదులుకోదల్చుకోలేదు. కానీ జీవితతో పరిచయం తన నిర్ణయం మార్చుకునేలా చేసింది. తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాం అన్నారు రాజశేఖర్.

 

జీవిత.. రాజశేఖర్ ను దక్కించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసినట్లు స్పష్టమవుతోంది. అతన్ని నాకు తెలియకుండానే ఇష్టపడేదాన్ని. అతను వేరొకరిని పెళ్లి చేసుకుంటే మాత్రమేం.. నేను ప్రేమించకూడదని ఏమైనా ఉందా అని ప్రశ్నించేటంత ఇష్టం ఉండేది. మామూలుగా ఉండే నేను కావాలనుకున్న దాని గురించి ఎంత వరకైనా వెళ్తానని అలా అర్ధమైంది. నా ఇష్టం అతనికి నచ్చింది. 

 

క్రమంగా ఈ విషయం జీవిత ఇంటిలో తెలియడంతో.. రాజశేఖర్ నిన్ను పెళ్లి చేసుకునే పరిస్థితుల్లో లేడని తెలిసి కూడా నువ్వు అతన్ని ఎందుకు ఇష్టపడుతున్నావు అంటూ ఆమె కుటుంబ సభ్యులు తనని నిలదీశారట. దీనికి జీవిత తాను జీవితాంతం ఒంటరిగా ఉండిపోతాను కాని రాజశేఖర్ ని తప్ప వేరొకరిని పెళ్లి చేసుకోను అని ఖరాఖండిగా చెప్పేశారట. ఇక మరోవైపు జీవిత అంటే ఇష్టం, ప్రేమ ఉన్నప్పటికి తన తల్లి మాట కాదనలేక పెళ్లి సంబంధాలు కూడా చూశారట రాజశేఖర్.

 

విధి ఒకలా తలిస్తే ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండదు అన్నట్టుగా.. రాజశేఖర్ కి పెళ్లి సంబంధాలు కుదరలేదు. ఇక జీవిత- రాజశేఖర్ లు మాత్రం తమ ప్రేమని కొనసాగిస్తూనే ఉన్నారు. వీరి ప్రేమ ఎంతవరకు వెళ్లిందంటే సినిమా షూటింగ్ అయిపోయాక ఇద్దరు కలసి ఒకే రూమ్ లో ఉండడం.. ఎక్కడికెళ్లినా కలిసి వెళ్లడం.. ఇలా దాదాపు సహజీవనం చేశారట. ఇదే విషయాన్ని జీవిత ఒక ఇంటర్వ్యూ లో చెబుతూ.. ఇప్పుడు చాలామంది మేము చాలా మోడ్రన్.. ప్రేమించుకునేటప్పుడు ఇలా చేశాం.. అలా చేశాం అని చెబుతుంటారు కదా.. అవన్ని మేము దాదాపు 25 ఏళ్ళ క్రితమే చేశామని చెప్పారు..

 

వీరి ప్రేమ బంధం క్రమంగా బాగా బలపడిపోయింది.. వీరిద్దరూ కలిసి నటిస్తున్న మగాడు చిత్రం షూటింగ్ సమయంలో రాజశేఖర్ కి మేజర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ సమయంలో రాజశేఖర్ పక్కనే ఉంటూ జీవిత అన్ని సపర్యలు చేసింది. ఇది చూసిన రాజశేఖర్ తల్లి కొన్ని రోజులకి వీరి ప్రేమని అంగీకరించడంతో 1991 చెన్నైలో వీరి వివాహం జరిగింది. వీరిరువురికి ఇద్దరు అమ్మాయిలు - శివాని & శివాత్మిక. ప్రస్తుతం శివాని మెడిసిన్ చేస్తుండగా.. ఈ ఏడాదే దొరసాని చిత్రం ద్వారా శివాత్మిక నటిగా తెలుగు చిత్రసీమకు పరిచయమైంది. భవిష్యత్తులో ఈ ఇద్దరూ కూడా యాక్టింగ్ నే  తమ కెరీర్ ని ఎంచుకున్నట్టుగా వారు ప్రకటించడం జరిగింది. ఆఖరుగా జీవిత, రాజశేఖర్ అనేవి రెండు వేరే పేర్లే అయినప్పటికి వీరి మధ్య ఉన్న అనుబంధం, ఆప్యాయత ఆ రెంటిని జంట పేర్లుగా చేసేశాయి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: