అక్కినేని సమంత గత ఏడాది మజిలీ, యూ టర్న్, ఓ బేబీ సినిమాల ద్వారా టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ లు అందుకుంది అనే చెప్పాలి. యు టర్న్, ఓ బేబీ వంటి వైవిధ్యమైన కథా సినిమాల్లో తన ఆకట్టుకునే నటనతో అలరించిన సమంత, మజిలీ వంటి హృద్యమైన స్టోరీ లోను తన మార్క్ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టింది. ఇక ఈ ఏడాది సమంత నటించిన తొలి సినిమా జాను మొన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ ని సంపాదించింది. రెండేళ్ల క్రితం తమిళ్ రిలీజ్ అయి సూపర్ హిట్ కొట్టిన 96 అనే సినిమాకు తెలుగు రీమేక్ గా రూపొందిన ఈ సినిమాకు ఒరిజినల్ మాతృకను తెరకెక్కించిన సి ప్రేమ్ కుమారే దర్శకత్వం వహించడం విశేషం. 

 

తెలుగులో దిల్ రాజు నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కింది. సమంతకు జోడిగా శర్వానంద్ నటించిన ఈ సినిమాలోని హృద్యమైన లవ్ స్టోరీ, కథ, కథనాలు ప్రేక్షక నాడిని పట్టుకోవడంతో మెజరిటీ ప్రేక్షకులు ఈ సినిమాపై పాజిటివ్ రెస్పాన్స్ ని అందించారు. అయితే తొలి రోజు నుండే మంచి టాక్ ని సంపాదించుకున్న ఈ సినిమా, కలెక్షన్ పరంగా మాత్రం చాలా వీక్ గా నడుస్తున్నట్లు ట్రేడ్ విశ్లేషకుల టాక్. 

 

ఇప్పటికే ఈ సినిమా బి, సి సెంటర్స్ లో ఆల్మోస్ట్ స్లో అయిందని మరోవైపు సినిమా ఓవర్సీస్ లో చాలా దారుణంగా పడిపోయిందని, ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తుంటే మరొక వారం రోజుల్లో దాదాపుగా చాలా సెంటర్స్ లో ఈ సినిమా క్లోజ్ అయ్యే అవకాశం కనపడుతోందని అంటున్నారట. ఇక జాను రిలీజ్ తరువాత వీక్ ఎండ్స్ లో ఇప్పటికీ సరిలేరు, అలవైకుంఠపురములో సినిమాలు తమ హవా ని కొనసాగిస్తూనే ఉన్నాయని, ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమా ఫ్లాప్ వెంచర్ గా మిగిలే ఛాన్స్ ఉందని అంటున్నారు. దీనిని బట్టి మరికొద్దిరోజుల్లో గడిస్తేనే కానీ ఈ సినిమా పరిస్థితి పూర్తిగా తెలుస్తుందని అర్ధం అవుతోంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: