విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన కూలీ నంబర్ వన్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది హైదరాబాదీ అమ్మాయి టబు. ఆ తర్వాత టాలీవుడ్ కింగ్, మన్మధుడు నాగార్జున నటించిన నిన్నే పెళ్ళాడతా సినిమాలో నాగ్ సరసన నటించింది. క్రియోటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. అన్నపుర్ణ బ్యానర్ పై నాగారున అక్కినేని నిర్మించిన ఈ సినిమా అప్పుడొక సంచలనం. బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సినిమా యూత్ నే కాదు టోటల్ ఫ్యామిలీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. అప్పటి నుంచి నాగార్జున ని గ్రీకువీరుడు అంటూ అమ్మాయిలు ముద్దుగా పిలుచుకునేవాళ్ళు కూడా. అంతేకాదు ఆ సినిమా నుంచి నాగార్జున కి విపరీతంగా అమ్మాయిల్లో ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇక ఈసినిమా నేషనల్ అవార్డ్ ని సొంతం చేసుకుంది.

 

అంతేకాదు హీరోగా నాగార్జున, హీరోయిన్ గా టబు, డైరెక్టర్ గా కృష్ణవంశీ వాళ్ళ సినిమా కెరీర్ లో బెస్ట్ సినిమా గా మిగిలిపోయింది. మొదటి సారి టాలీవుడ్ కి పరిచయమైన మ్యూజిక్ డైరెక్టర్ సందీప్ చౌతా ఆ తర్వాత మళ్ళీ నాగార్జున నటించిన సూపర్ సినిమాకి మ్యూజిక్ ని అందించాడు. ఇలా అన్ని ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవడానికి కారణం అయితే నాగార్జూన టబుల మధ్య స్నేహం బలపడటానికి కూడా నిన్నే పెళ్ళాడతా సినిమా కారణం అని చెప్పాలి. నాగ్ టబుల కి ఈ సినిమా చాల ప్రత్యేకం అని ఖచ్చితంగా చెప్పాలి.

 

అయితే ఈ సినిమా తర్వాత టబు నాగార్జునని ఇష్టపడిందని ఇంకా చెప్పాలంటే నాగార్జున కోసం పెళ్ళి కూడా చేసుకోకుండా అలాగే ఉండిపోయిందని ఎప్పుడూ ఒక న్యూస్ అలానే చక్కర్లు కొడుతూ ఉంటుంది. అంతేకాదు చాలా మంది ఈ విషయాన్ని నాగార్జున దగ్గర ప్రస్తావించారు కూడానట. అయితే అందులో వాస్తవం మాత్రం ఎంత మాత్రం లేదని టబు కి నాకు మధ్య ఏమీ లేదని ఎన్నోసార్లు నాగ్ చెప్పారు. అప్పట్లో ఏ ఇంటర్వ్యూలో అయినా ఖచ్చితంగ నాగార్జున దగ్గర టబు ప్రస్తావన వస్తూనే ఉండేది. అయినా వాటికి నాగ్ ఓపికగా సమాధానం చెప్పారు. ఇక గతం కొన్నేళ్ళుగా జనాలలో నాగ్ టబు టాపిక్ లేవనెత్తనే లేదు. కానీ ఈ మధ్య టబు అల వైకుంఠపుర్రములో సినిమాతో టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో మంచి పాత్ర పోషించి మళ్ళీ తన సత్త ఏంటో చాటి చెప్పింది. 

 

ఇదిలా ఉంటే నాగార్జున టబు మళ్ళీ కలిసి సినిమా చేస్తారని నాగ్ సినిమాలో టబు ముఖ్య పాత్ర చేయడానికి కమిటయిందని టాక్ మొదలైంది. అంతేకాదు నాగార్జున కొడుకుల సినిమాలలోను టబు ని నటింపచేయడానికి నాగ్ ప్తయత్నిస్తున్నాడని రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. అయితే అందులో వాస్తవం లేదని తెలుస్తోంది. ఇక టబు రీ ఎంట్రీతో ఇంత రచ్చ మళ్ళీ మొదలైందని టబుకి ఉన్న వ్యక్తిగత కారణాలతోనే పెళ్ళి చేసుకోకపోతే అది నాగార్జున కి అంటగట్టడం ఏంటని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారట. ఏదేమైనా ఒక్క నిన్నే పెళ్ళాడతా సినిమా నిజ జీవితంలో నాగ్ టబుల కి పెళ్ళి చేసినమత పని చేసి జీవితాంతం వెంటాడుతూనే ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: