నిన్నటి నుంచి ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు అందరిలో ఒకే ఒక్క సినిమా గురించి పెద్ద చర్చ నడుస్తోంది. అదే ప్యారసైట్. ఇప్పటివరకూ 92 ఏళ్ల ఆస్కార్ చరిత్రలోనే ఒక విదేశీ ఉత్తమ చిత్రంగా గా ఎంపిక కాలేదు. కానీ తొలిసారిగా ప్యారసైట్ ఘనతను సాధించింది. ఇక ఇప్పటి వరకూ ఒక దక్షిణ కొరియా చిత్రం కనీసం ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో కూడా ఒక్కసారి అవార్డు పొందకపోతే ఏకంగా ప్యారసైట్ ఉత్తమ చిత్రం అవార్డుని ఎగరేసుకుని పోవడం సినీ విశ్లేషకులను మరియు ప్రేక్షకులని తీవ్రమైన ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కానీ సినిమా చూసిన వాళ్ళు మాత్రం చిత్రానికి అవార్డు రావడంతో అతియోశక్తి లేదంటారు.

 

ఇకపోతే ఉత్తమ చిత్రం కేటగిరి తో పాటు ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డులను పొందిన చిత్రం తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన సినిమాకు రీమేక్ అని ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చిన వార్త భారీగా చక్కర్లు కొడుతోంది. హైదరాబాద్ తో సహా తెలుగు రాష్ట్రాలలోని కొన్ని నగరాల్లో సినిమాను సబ్ టైటిల్స్ తో ప్రదర్శిస్తున్నారు. అయితే మన తమిళ తంబీలు మాత్రం తమ సినిమాను కాపీ కొట్టి ప్యారసైట్ ను తీశారని ఇంకా ఆస్కార్ అవార్డులు కూడా కొట్టేశారు అని పోస్ట్లు పెడుతుండటం విశేషం.

 

1999లో విడుదలైన 'మిన్సార కన్నా' చిత్రం కు సీనియర్ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహించగా హీరో విజయ్ ప్రధాన పాత్రలో నటించాడు. సినిమా అప్పట్లోనే యావరేజ్ గా ఆడింది. సినిమా కథకు, 'ప్యారసైట్'కు చాలా సారూప్యతలు ఉన్నాయని.. బహుశా సౌత్ కొరియన్ డైరెక్టర్ సినిమా చూసి స్ఫూర్తి పొంది.. కథనే కొంచెం మార్చి, కొన్ని మలుపులు జోడించి 'ప్యారసైట్' తీసి ఉండొచ్చని తీర్మానాలు చేసేస్తన్నారు తమిళ జనాలు.  ఇక వీళ్ళను మిగతా భాషల సినీ అభిమానులు ట్విట్టర్ లో తెగ ట్రోల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: