టాలీవుడ్ ఇండస్ట్రీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ‘అల వైకుంఠపురం లో’ సూపర్ డూపర్ హిట్ అయింది. సంక్రాంతి పండుగకు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర విడుదలైన అన్ని సినిమాల కంటే అల వైకుంఠపురం లో సినిమాయే ఘన విజయం సాధించింది. నాన్ బాహుబలి రికార్డులు క్రియేట్ చేస్తూ ఇంకా సినిమా హాల్లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. దీంతో మొన్నటి వరకు ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న త్రివిక్రమ్ త్వరలోనే తన తర్వాత సినిమా స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ తో ఓ సరికొత్త సినిమా తీయడానికి త్రివిక్రమ్ రెడీ అవుతున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి.

 

గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన అరవింద సామెత వీర రాఘవ సినిమా అదిరిపోయే రేంజ్ లో హిట్ అయ్యింది. ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా కి తెలుగు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాలో ఎన్టీఆర్ ని సరికొత్త స్టైల్ లో చూపించడానికి త్రివిక్రమ్ రెడీ అవుతున్నాడు. మేటర్ లోకి వెళితే ఎన్టీఆర్ ఓ పొలిటికల్ పార్టీ లీడర్ గా ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడు అని ఫిలిం నగర్ లో వినపడుతున్న టాక్.

 

రాజకీయ నేపథ్యంలోనే త్రివిక్రమ్ ఎన్టీఆర్ కోసం స్క్రిప్టు రెడీ చేయబోతున్నట్లు వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా పూజా హెగ్డే నీ ఇప్పటికే త్రివిక్రమ్ సెలెక్ట్ చేసినట్లు సమాచారం. త్రివిక్రమ్ హోం బ్యానర్ గా చెప్పుకునే హాసిన హారిక బ్యానర్ లో తెరకెక్కబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతర్వాత త్రివిక్రమ్ సినిమా చేసే చాన్స్ ఉందని ఫిల్మ్ నగర్ టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: