టాలివుడ్‌లో సినిమాలలో నాని సినిమాలంటే యువతలో ఏదో తెలియని ఉత్సాహం కలుగుతుంది. తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా  తనకంటూ మంచిపేరును సంపాదించుకున్నారు. అయితే  సినిమాలలో విభిన్న పాత్రలను పోషించి యువతి మనసులను దోచుకుంటున్నాడు. అయితే న్యాచురల్ స్టార్ నానికి కూడా ప్రేమ కథ ఉందంటా.. రీల్ లైఫ్ లో కాకుండా రియల్ లైఫ్ లోనూ తన ప్రియురాలితో ప్రేమను మస్తుగా ఎంజాయ్ చేశాడట ఆ పూర్తి వివరాల్లోకి వెళితే...

 

న్యాచురల్ గా కనిపించే నాని తన నిజ జీవితంలోనూ అంతే న్యాచురల్ లవ్ ట్రాక్ నడిపాడంట. సో తన ప్రేమ కథ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందామా... అంజనాతో అల భాగ్యనగరంలో.. న్యాచురల్ స్టార్ నాని భాగ్యనగరంలో అప్పటి తన ప్రియురాలు అంజనాతో కలిసి అల భాగ్యనగరంలో చక్కర్లు కొట్టేవారట. హీరో నాని ఆ రోజుల్లో ఓ ప్రముఖ ఎఫ్ఎం ఛానెల్లో ఇంటర్న్ షిప్ చేసే సమయంలోనే అంజనాతో ప్రేమాయణం మొదలుపెట్టాడట. అదే సమయంలో అంజనాను పికప్ చేసుకోవడానికి నాని ఆ ఎఫ్ంఎం ఛానెల్ బయట గంటల కొద్దీ పడిగాపులు కాసేవాడట. తొలుత స్నేహం.. నాని ఎప్పుడైతే హీరోగా నిలదిక్కుకుంటున్నాడో, ఆ తొలి రోజుల్లోనే తన స్నేహితుడికి కజిన్ వరసైన అంజనా యలవర్తితో తొలుత స్నేహం చేశాడట. అయితే వారిద్దరికి పరిచయమైన తొలి రోజుల్లో ఒకరంటే ఒకరికి పడి చచ్చేంత ఇష్టమున్నా వారు ఆ ప్రస్తావనను ఎప్పుడూ బయటపెట్టుకోలేదట.

 


తమ ప్రేమ గురించి ఈ విషయాన్ని కేవలం వారి సన్నిహితులకు మాత్రం తెలుసట. ఇక వీరిద్దరి ప్రేమ విషయం పెద్దలకు తెలపడంతో వారి ఇరు కుటుంబాల్లో ఎలాంటి అభ్యంతరం చెప్పలేదట. దీంతో వీరిద్దరూ కలిసి కుటుంబం, పెద్దలు, స్నేహితుల సమక్షంలో 2012లో వివాహం చేసుకున్నారు.

 

అప్పట్లో బాగా పాపులర్.. అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి నుండి అగ్ర హీరోగా ఎదిగిన న్యాచురల్ స్టార్ నాని తన స్నేహపూర్వమైన స్వభావంతో సినిమా రంగంలో ఎందరో మిత్రులను సంపాదించుకున్నారు. దీంతో ఆయన వివాహానికి ఎందరో సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే అప్పట్లో నాని - అంజనా ఎంగేజ్ మెంట్ వీడియో మంచి పాపులర్ అయ్యింది. ఎందుకంటే అప్పట్లో ఎంగేజ్ మెంట్ వీడియోల కల్చర్ కు అంతగా ప్రాధాన్యత లేదు. అయితే ఈ వీడియో ద్వారా ఎంగేజ్ మెంట్ మంచి పాపులారిటీ వచ్చింది. అప్పట్లో ఈ వీడియో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

 

రొమాంటిక్ కపుల్ ప్రేమకు కానుకగా 2017లో అర్జున్ జన్మించాడు. అందుకే ఇంతకుముందు తను నటించిన జెర్సీ సినిమాలో నాని పోషించిన పాత్రకు అర్జున్ అనే పేరు కూడా పెట్టారు. ఈ హీరో తన కెరీర్ ను ఎంత న్యాచురల్ గా మొదలుపెట్టాడో.. తన ప్రేమ ప్రయాణాన్ని అంతే సహజంగా స్టార్ చేసి... సాఫీగా జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఇలాంటి ప్రేమికులు చాలా అరుదుగా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: