టాలీవుడ్‌ యంగ్ హీరో మంచు మనోజ్‌ సినిమాల్లో కంటే సోషల్‌ మీడియాలోనే ఎక్కవ యాక్టివ్‌గా కనిపిస్తుంటాడు. ఇటీవల విడాకుల వార్తలతో హాట్‌ టాపిక్‌గా మారిన మనోజ్‌, త్వరలోనే సినిమా చేస్తానంటూ ప్రకటించాడు. అంతేకాదు ఇక బతికున్నంతకాలం సినిమాల్లోనే ఉంటానంటూ భారీ స్టేట్‌మెంట్ ఇచ్చేశాడు. హడావిడిగా ఓ బ్యానర్‌ను కూడా స్టార్ట్ చేసి త్వరలో సినిమా ప్రకటిస్తానని హింట్ ఇచ్చాడు.

 

ఇటీవల మరో ఆసక్తికర ట్వీట్ చేశాడు  మనోజ్‌. మరో వారం రోజుల్లో ఓ ఇంట్రస్టింగ్ న్యూస్‌ చెపుతానంటూ కామెంట్‌ చేశాడు. జనవరి 28న ఈ ట్వీట్ చేసిన మనోజ్ తరువాత ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు. దీంతో ఓ అభిమాని అప్‌డేట్ ఎప్పుడన్న వెయిటింగ్‌ అంటూ మనోజ్‌కు ట్యాగ్‌ చేస్తూ కామెంట్ చేశాడు. ఈ కామెంట్‌కు రిప్లై ఇచ్చిన మనోజ్‌, అభిమానిని క్షమాపణ కోరాడు.

 

`సారీ తమ్ముడూ.. ఇంకొంచెం టైం వెయిటింగ్‌ అంతే` అంటూ రిప్లై ఇచ్చాడు. విడాకుల తరువాత ఫ్యామిలీతో ఎక్కవ సమయం గడిపేందుకు ఇష్టపడుతున్న మనోజ్‌, వరుసగా ఫ్యామిలీ ఫంక్షన్లలో సందడి చేస్తున్నాడు. ఈ మంచు హీరో చివరగా ఒక్కడు మిగిలాడు సినిమాలో నటించాడు. ఈ సినిమాలో మనోజ్‌ తమిళ పులి ప్రభాకరన్‌ పాత్రలో నటించాడు. ఈ సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్నమనోజ్‌ త్వరలోకొత్త సినిమా ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడు.

 

మరో మంచు హీరో విష్ణు మాత్రం సినిమాలతో పాటు వ్యాపార రంగంలోనూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం క్రాస్‌ఓవర్‌ మూవీగా తెరకెక్కుతున్న మోసగాళ్లు సినిమాలో నటిస్తున్న విష్ణు, వరుసగా వ్యాపారాలను ప్రారంభిస్తున్నాడు. ఇప్పటికే సొంతంగా ప్లే స్కూల్ చైన్‌ను నిర్వహిస్తున్న విష్ణు త్వరలో తన కవల కూతుళ్ల పేరు మీద ఓ ఫ్యాషన్‌ బ్రాండ్‌ను లాంచ్‌ చేయనున్నాడు. మంచు వారసురాలు లక్ష్మీ కూడా ఫుల్‌ బిజీగా ఉంది. టీవీ షోలతో పాటు సొంత వ్యాపారాలను నిర్వహిస్తోంది. ఇప్పటికే ఓ పర్ఫ్యూమ్ బ్రాండ్‌ను స్టార్ట్ చేసిన లక్ష్మీ నిర్మాణ రంగంలోనూ దూసుకుపోతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: