రామ్ గోపాల్ వర్మ తాత అయిన సందర్భంగా అతడిని అభినందిస్తూ రాజమౌళి చేసిన సరదా ట్విట్ జూనియర్ చరణ్ అభిమానులకు విపరీతమైన అసహనాన్ని తెప్పించింది. దీనితో రాజమౌళిని ఒక రేంజ్ లో ఆటాడుకుంటూ జక్కన్న ను టార్గెట్ చేస్తూ సెటైర్లు వేస్తున్నారు. 


‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ ప్రారంభమై సంవత్సరం దాటిపోయినా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను కాని అదేవిధంగా ఈ మూవీ టైటిల్ ను కాని ప్రకటించదానికి ఖాళీ లేని రాజమౌళికి వర్మను అభినందించడానికి సమయం దొరికిందా అంటూ జోక్స్ వేస్తున్నారు. అంతేకాదు చరణ్ జూనియర్ ల ఫస్ట్ లుక్ ఎప్పుడు విడుదల చేస్తారు అంటూ అభిమానులు డైరెక్ట్ గా రాజమౌళిని టార్గెట్ చేస్తున్నారు. 


దీనితో ఊహించని ఈ సెటైర్ల దాడికి రాజమౌళి షాక్ అయినట్లు సమాచారం. గతంలో రాజమౌళి తనకు బాగా సన్నిహితులైన కొందరు నిర్మాతలు దర్శకులు తీసిన సినిమాల పై తన కామెంట్స్ చేస్తూ ఉండేవాడు. అయితే అప్పట్లో అతడి కామెంట్స్ పై కూడ ట్రోలింగ్ జరగడంతో ఈమధ్య కాలంలో ఏ సినిమా గురించి రాజమౌళి మాట్లాడటం మానేసాడు.


ఇప్పుడు చాలాకాలం తరువాత సరదాగా రామ్ గోపాల్ వర్మ ను ఆటపట్టిద్దామని రాజమౌళి ప్రయత్నిస్తే ఇప్పుడు ఆ ప్రయత్నం అతడికే ఎదురు తిరిగి చరణ్ జూనియర్ ల అభిమానుల చేత టార్గెట్ అవ్వడం అత్యంత ఆశ్చర్యంగా  మారింది. ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల ఏకంగా వచ్చే ఏడాదికి వాయిదా పడటం ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి చరణ్ జూనియర్ ల లుక్స్ కు సంబంధించిన ఫస్ట్ లుక్స్ బయటకు రాకపోవడం అభిమానులను ఎంతగా బాదిస్తోందో అన్న విషయం ఇప్పుడు జక్కన్న పై చరణ్ జూనియర్ అభిమానులు చేస్తున్న మాటల దాడిని బట్టి అర్ధం అవుతుంది. దీనితో ఇక రానున్న రోజులలో రాజమౌళి ఏదైనా ట్విట్ పెట్టాలి అంటే ఒకటికి వందసార్లు ఆలోచించుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: