ఏ జనరేషన్‌లో అయినా వెండితెర మీద మోస్ట్‌ సక్సెస్‌ఫుల్ కాన్సెప్ట్‌ ప్రేమ కథలే. ముఖ్యం తెలుగు సినిమాల్లో ప్రేమ అనేది ఓ కామన్‌ పాయింట్. కథా కథనాలు ఏవైన ప్రేమ అనే పాయింట్ మాత్రం ప్రతీ సినిమాలో తప్పకుండా ఉంటుంది. అయితే ప్రేమ గొప్పతనాన్ని చాటి చెప్పేందుకే రూపొందించిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. కేవలం తెలుగులోనే కాదు దేశంలోనే అతి గొప్ప ప్రేమ కథ దేవదాస్‌. శరణ్ నవల రూపంలో రాసిన ఈ కథను దాదాపు అన్ని భాషల్లో సినిమాగా తెరకెక్కించారు. అయితే తెలుగులో పండినంత అద్భుతంగా మరే భాషలోనూ ఈ సినిమా మెప్పించలేకపోయింది.

 

తెలుగు సినిమా స్థాయిని పెంచిన మరో ప్రేమకథ గీతాంజలి. నాగార్జున హీరోగా మణిరత్నం తెరకెక్కించిన ఈ క్లాసిక్‌ ఆల్‌టైం బెస్ట్ లవ్‌స్టోరీస్‌లో స్థానం సంపాదించుకుంది. చావుకు దగ్గరైన ఇద్దరు ప్రేమికుల బావోద్వేగాలను వెండితెర మీద ఒడిసిపట్టడంలో దర్శకుడు చూపించిన ప్రతిభ ఎంతో మందికి స్పూర్తి నిచ్చింది. అంతేకాదు ఒక జనరేషన్‌ మొత్తానికి ప్రేమపట్ల గౌరవం కలిగేలా చేసిందనటంలో ఏ మాత్రం అతిషయోక్తి లేదు. ఇప్పటికీ ఈ సినిమా వస్తే టీవీలకు అతుక్కుపోయే ఆడియన్స్‌ ఉన్నారంటే ఆ ప్రేమకథ ఎంత గొప్పదో అర్ధం చేసుకోవచ్చు.

 

ప్రేమ అంటే వెకిలి చేష్టలు కాదు, ఓ ఇద్దరి మధ్య బంధం, అనుబంధం, బాధ్యత అని నిరూపించిన సినిమా స్వర్ణకమలం. తన ప్రేమించిన అమ్మాయిని ఓ గొప్ప కళాకారిణిగా చూడలనుకునే ఓ యువకుడి తాపత్రేయాన్ని అద్భుతంగా వెండితెర మీద ఆవిష్కరించిన సినిమా ఇది. ఏమాత్రం అశ్లీలతకు తావులేని ఓ అందమైన ప్రేమ గత ఇది అందుకే స్వర్ణకమలం గొప్ప ప్రేమకథల సరసన నిలిచింది.

 

ఈ జనరేషన్‌లోనూ ఇలాంటి ప్రేమకథలు ఉన్నాయి. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా కరుణాకరన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా తొలిప్రేమ. ప్రేమంటే శరీరాల సంబంధం కాదు, మనసుల మధ్య అనుబంధం అని చెప్పే ఈ సినిమా ఆల్‌టైం బెస్ట్ లవ్‌ స్టోరి అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. యువతలో ప్రేమపట్ల మారుతున్న ఆలోచనలను మరోసారి సరైన గాడిలోకి తీసుకువచ్చి, ప్రేమ అంటే ఓ బాధ్యత అని అర్ధమయ్యేల చెప్పిన సినిమా తొలిప్రేమ.

 

ఇవే కాదు నువ్వు కావాలి, ఆనంద్‌, జయం, నువ్వు నేను, ఖుషీ, ఆర్య, ప్రయాణం, ఏం మాయచేసావే, మళ్లీ మళ్లీ ఇది రానీ రోజు, కుమార్‌ 21ఎఫ్, అర్జున్‌ రెడ్డి లాంటి కమర్షియల్ ప్రేమకథలు కూడా ఈ జనరేషన్‌లో చాలానే వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: