మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. బాస్ ఎప్పుడు కొత్త సినిమా చేస్తాడా అని మెగా అభిమానులు ఎదురుచూస్తూంటారు. మెగాస్టార్ కూడా ఈమధ్య తన సినిమాలను అలానే లైన్ లో పెడుతున్నారు. సైరా ఘన విజయం తర్వాత ఆయన కొరటాల శివతో సినిమా ప్రారంభించారు. ఫిజిక్ కోసం ఓ మూడు నెలలు షూటింగ్ ఆలస్యమైనా ఇప్పుడు చాలా స్పీడ్ గా షూటింగ్ జరుపుకుంటోంది. చిరంజీవి 152వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీకి ఆచార్య అనే టైటిల్ అనుకుంటున్నారు. ఈ సినిమా తర్వాత చిరంజీవి చేయబోయే సినిమాపై ఓ వార్త ఫిలింనగర్ లో రౌండ్ అవుతోంది.

 

 

ఆమధ్య రామ్ చరణ్ తండ్రి కోసం మళయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ రైట్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా గురించి ఓ అప్డేట్ అందుతోంది. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తయిందని తెలుస్తోంది. ఈ సినిమాకు టెక్నికల్ టాలెంటెడ్ డైరక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే.. తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేయాల్సి ఉండడం, చిరంజీవి 152వ సినిమాగా కొరటాలకు ఫిక్స్ అవడం, బన్నీతో సుక్కూ సినిమా కమిట్ మెంట్ ఉండడంతో ఈ సినిమాను అప్పటికి పక్కన పెట్టారు. ఇప్పుడు ఈ సినిమాను చిరంజీవి 153వ సినిమాగా ఇదే కన్ఫర్మ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి.

 

 

ప్రస్తుతానికి ఈ విషయంపై అఫిషియల్ కన్ఫర్మేషన్ లేనప్పటికీ ఈ వార్తపై ఫిలింగ్ నగర్ లో చర్చించుకుంటున్నారు. చిరంజీవి ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడని అందుకే తండ్రి కోరికపై ఈ సినిమా రీమేక్ రైట్స్ చరణ్ తీసుకున్నాడట. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి పేరు వినిపించినా చిరంజీవిచరణ్ మాత్రం సుకుమార్ వైపై మొగ్గు చూపుతున్నారని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: