ఉల్లాసం కోసం, ఉత్సాహం కోసం రెండున్నర గంటలు టైం పాస్ చేయడం కోసం చూసే సినిమాలు ప్రేక్షకులను అలరించేవి కొన్నైతే వారితో పాటు ఇంటికి వెళ్ళేవి కొన్ని. ఇక వెండితెర మీద ప్రేమకథలకు ఎప్పుడు మంచి డిమాండ్ ఉంటుంది. సినిమాకు జానర్లు ఎన్నున్నా యూత్ ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలంటే మాత్రం లవ్ స్టోరీ ఉండాల్సిందే. అది కూడా మనసుని కదిలించే ప్రేమకథ అయితే ఇక ఆడియెన్స్ చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు.

 

సిల్వర్ స్క్రీన్ పై లవ్ ఫార్ములా ఎప్పుడూ సక్సెస్ అవుతుంది. ఒక గొప్పింటి అమ్మాయిని పేదింటి అబ్బాయి ప్రేమించడం ఆ ప్రేమను దక్కించుకునేందుకు అతను చేసే ప్రయత్నాలు ఇవన్ని ఆడియెన్స్ కు భలే కిక్ ఇస్తాయి. తెర మీద ప్రేమకథ తనదే అన్నట్టుగా అన్వయించుకుంటారు. అయితే అలాంటి అనుభూతి పొందేలా సినిమా తీయడం కూడా దర్శకుడి ప్రతిభ అని చెప్పొచ్చు. ప్రేమలేఖల కాలం నుండి ఫెస్బుక్ ప్రేమ వరకు వెండితెర ప్రేమకథ ప్రేక్షకులను అలరించడంలో ఎప్పుడు ఫెయిల్ అవలేదు. ప్రియురాలి ప్రేమను దక్కించుకోవడం అనే కాన్సెప్ట్ లో తెలుగులో వేల కొద్దీ సినిమాలు వచ్చాయి.

 

దేవదాస్ ఫెయిల్యూర్ లవ్ స్టోరీని హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులు మరెన్నో సక్సెస్ అయినా లవ్ స్టోరీలను సూపర్ హిట్ చేశారు. ఏం చేసినా.. ఎలా చేసినా.. తెర మీద ప్రేమకథలకు ఒక చరిత్ర ఉంది. లవ్ స్టోరీ అంటే యువత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. వారిని దృష్టిలో ఉంచుకుని సరికొత్త లవ్ స్టోరీస్ తో మనముందుకు వస్తున్నారు సినీ మేకర్స్. ఈ వెండితెర ప్రేమకు ఎన్నాళ్ళు అయినా ముగింపు ఉండదు.. ఒకప్పుడు సక్సెస్ అయిన లవ్ స్టోరీస్ నే తెర మీద చూపించారు.. కానీ ఆడియెన్స్ ఆలోచన విధానం మారింది.. అందుకే ఫెయిల్యూర్ లవ్ స్టోరీలను కూడా ఆదరిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: