టాప్ హీరోల వారసులు అంతా ఫిలిం ఇండస్ట్రీలో హీరోలుగా ఎంట్రీ ఇచ్చి తమ వారసత్వాన్ని కొనసాగిస్తున్న పరిస్థితులలో ఈ విషయమై బాలయ్య వెనకపడి ఉండటం బాలకృష్ణ అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. వాస్తవానికి బాలయ్య తన కొడుకు మోక్షజ్ఞ ను హీరోగా పరిచయం చేయాలి అని భావిస్తున్నా మోక్షజ్ఞ ఆలోచనలు మాత్రం సినిమా కెరియర్ పై లేకపోవడంతో ఇప్పటికే బాలకృష్ణ కన్ఫ్యూజ్ అవుతున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి. 


ఇలాంటి పరిస్థితులలో మోక్షజ్ఞ అమెరికా ప్రయాణానికి సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో చక్కర్లు కొడుతోంది. తెలుస్తున్న సమాచారం మేరకు మోక్షజ్ఞ అమెరికాలో న్యూయార్క్ లో ఉన్న లీ స్టార్స్ బర్గ్ ఫిలిం ఇన్ స్టిట్యూట్ లో ఒక సార్ట్ టర్మ్ క్రాష్ కోర్స్ తీసుకోవడానికి అమెరికా వెళ్ళే విధంగా బాలయ్య మోక్షజ్ఞ ను ఒప్పించినట్లు తెలుస్తోంది. 


దీనితో మోక్షజ్ఞ మనసు మారిందా అంటూ వార్తలు గుప్పు మంటున్నాయి. అంతేకాదు ఈ నందమూరి వారసుడు అమెరికా నుండి తిరిగి వచ్చిన తరువాత బాలయ్య బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ షూటింగ్ స్పాట్ కు ప్రతిరోజు తీసుకు వచ్చి మోక్షజ్ఞ కు సినిమా కెరియర్ పై మోజు పెరిగేలా మరొక ప్రయత్నం కూడ బాలయ్య ఆలోచనలో ఉంది అని అంటున్నారు. 


వాస్తవానికి మోక్షజ్ఞ అంగీకరిస్తే అతడి ఫిలిం ఎంట్రీకి సంబంధించి కథలు వినడానికి దర్శకుల అన్వేషణకు ప్రయత్నాలు ప్రారంభించాలని బాలయ్య ఆలోచనలు చేస్తున్నాడు. అయితే ఈ విషయంలో తన కొడుకు నుండి ఎటువంటి పాజిటివ్ స్పందన లేకపోవడంతో బాలయ్య ఆలోచనలు సగంలోనే ఆగిపోతున్నాయి. దీనితో బాలకృష్ణ ఆఖరి ప్రయత్నంగా చేస్తున్న ఈ అమెరికా ఫిలిం ఇన్స్టిట్యూట్ ప్రయోగం ఏదైనా అనుకున్న ఫలితాలు సాధిస్తే ఈ నందమూరి వారసుడి ఆలోచనలు మారి బాలయ్యతో పాటు నందమూరి అభిమానులకు కూడ జోష్ కలుగు తుందేమో చూడాలి..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: