టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ సంచలనంగా దూసుకు వచ్చిన విజయ్ దేవరకొండ అతి తక్కువ కాలంలో విపరీతమైన ఇమేజ్ తెచ్చుకోవడమే కాకుండా ఏకంగా టాప్ యంగ్ హీరోలకు దడ పుట్టించే రేంజ్ కి ఎదిగి పోయాడు అన్నది వాస్తవం. అయితే విజయ్ సినిమాలకు వందల కోట్ల రికార్డులు లేకపోయినా అతడి అభిమానులు మాత్రం లక్షల సంఖ్యలో ఉన్నారు. 


ముఖ్యంగా అమ్మాయిలలో కూడ విజయ్ దేవరకొండకు వీరాభిమానులు ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో విజయ్ దేవరకొండ కు ఇండస్ట్రీలో చాలామంది సహకరించడం లేదా అన్న చర్చలు మొదలయ్యాయి. దీనికి కారణం విజయ్ మహేష్ అల్లు అర్జున్ ల సినిమాలకు సంబంధించిన ఫంక్షన్స్ కు గతంలో అతిధిగా వచ్చాడు.


అదేవిధంగా అనేకమంది హీరోల సినిమాలు విడుదల అవుతున్న సందర్భంలో వారి సినిమాలు విజయవంతం అవ్వాలి అంటూ అభినందించడమే కాకుండా వారి సినిమాలకు సంబంధించిన టీజర్లు ట్రైలర్లు విడుదలైన వెంటనే వాటి పై ప్రశంసలు కురిపిస్తూ తాను అందరి వాడిని అని చాటుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసాడు. వాస్తవానికి అనేక మంది టాప్ హీరోల అభిమానులు కూడ విజయ్ ని అభిమానిస్తారు. 


అయితే చాలామంది హీరోలు మాత్రం విజయ్ దేవరకొండను దూరం పెడుతున్నారా అంటూ ఒక సరికొత్త ప్రచారం మొదలైంది. దీనికి కారణం ఈమధ్యనే జరిగిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిధిగా పిలుద్దామని ఈ మూవీ నిర్మాతలు కొంతమంది క్రేజీ హీరోలను సంప్రదిస్తే తాము బిజీగా ఉన్నాము అంటూ విజయ్ మూవీ ఫంక్షన్ కు రాకుండా కుంటి సాకులు చెప్పి తప్పించుకున్నట్లు గాసిప్పులు వస్తున్నాయి. అంతేకాదు ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ట్రైలర్ పై కనీసం ఒక్క హీరో కానీ అదేవిధంగా ఒక ప్రముఖ దర్శకుడు కాని కనీసపు ప్రశంసలు కురిపించక పోవడం చూసిన వారు ఇండస్ట్రీలోని చాలామంది విజయ్ అంటే భయపడుతున్నారా లేక ఈర్ష్య పడుతున్నారా అంటూ చాల మంది ఫిలిం సెలెబ్రెటీలు విజయ్ బాకీలు తీర్చలేకపోతున్నారు అంటూ జోక్స్ వేస్తున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: