నాగచైతన్య ‘మజిలీ’ ‘వెంకీమామ’ హిట్స్ తరువాత హ్యాట్రిక్ హిట్ కోసం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటిస్తున్న లవ్ స్టోరీ మూవీ పై చాల ఆశలు పెట్టుకున్నాడు. ‘ఫిదా’ సూపర్ సక్సస్ తరువాత శేఖర్ కమ్ముల తీస్తున్న మూవీ కావడం ఈ మూవీలో సాయి పల్లవి నటించడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడి భారీ స్థాయిలో బిజినెస్ కూడ అయింది.


ఈ సినిమాలో సాయి పల్లవి క్లాసికల్ డాన్సర్ గా నటిస్తోంది. ఈ మూవీ కథ రీత్యా హీరో హీరోయిన్ ను ఒక డాన్స్ కాంపిటీషన్ లో కలవడం జరుగుతుంది. అక్కడే వీరిద్దరు ఒకరితో ఒకరు ప్రేమలో పడిపోతారట.  ఈ ఎపిసోడ్ సినిమాకు కీలకం కాబట్టి చైతన్య తో కూడ కొన్ని డ్యాన్స్ స్టెప్స్  సాయి పల్లవి తో సమానంగా చైతన్య వేయవలసి ఉంది. 


అయితే చైతూ డాన్స్ విషయంలో చాల వీక్ అన్న విషయం గ్రహించిన శేఖర్ కమ్ముల శేఖర్ మాష్టర్ చేత చైతన్యకు ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేయించి ఈ సీన్ షూటింగ్ కు రెడీ చేసాడట. ఈ సీన్ షూటింగ్ మొదలు పెడుతున్నప్పుడు శేఖర్ కమ్ముల సాయి పల్లవి తో డాన్స్ విషయంలో చైతన్య వీక్ కాబట్టి సాయి పల్లవి ని తన డాన్స్ స్టెప్స్ చాల స్లోగా వేయమని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది.


దీనితో సాయి పల్లవి తన డాన్స్ విశ్వరూపం తగ్గించి ఎంత నెమ్మదిగా స్టెప్స్ వేసినా చైతన్య ఆ స్థాయికి కూడ చేరుకోవడానికి చాల ఇబ్బంది పడటంతో ఈ సీన్ షూట్ చేయడానికి అనేకసార్లు రీ టేక్ జరిగినట్లు సమాచారం. దీనితో నాగచైతన్య డాన్సింగ్ స్టైల్ పై శేఖర్ కమ్ముల కు అసంతృప్తి ఉన్నా ఆ విషయం బయటపడనీయకుండా తన సహజ సిద్ధమైన నవ్వును ప్రదర్శిస్తూ ఈ సీన్ షూట్ ఏదోవిధంగా పూర్తి చేసినా చైతన్యకు చుక్కలు కనిపించాయి అంటూ ఇండస్ట్రీ వర్గాలలో జోక్స్ పేలుతున్నాయి..    

 

మరింత సమాచారం తెలుసుకోండి: