తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోల తనయులు హీరోలుగా వచ్చారు.  అయితే స్టార్ ప్రొడ్యూసర్ రామానాయుడు కుటుంబం నుంచి విక్టరీ వెంకటేష్ హీరోా వచ్చారు.  ఆయన సోదరుడు ప్రొడ్యూసర్ డి.సురేష్ బాబు తనయుడు దగ్గుబాటి రానా ‘లీడర్’ చిత్రంతో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు.  ఈ చిత్రం శేఖర్ కమ్ముల తీశారు. రాజకీయ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం మంచి విజయం అందుకుంది.  ఆ తర్వాత రానా నటించిన చిత్రాలు పెద్దగా విజయ వంతం కాలేదు. కానీ రానా మాత్రం హీరో ఇమేజ్ చట్రంలో పడిపోకుండా తనకు ఏ పాత్ర నచ్చితే ఆ పాత్రలో నటిస్తూ.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.

 

ఇక రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి, బాహుబలి 2’ చిత్రాలతో ఏకంగా జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చుకున్నాడు.  ఆ మద్య తేజ దర్శకత్వంలో నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో మరో సంచలన విజయం అందుకున్నాడు రానా. ప్రస్తుతం    రానా  నటించిన బహు భాషా చిత్రం 'హాథీ మేరే సాథీ' ఫస్ట్ ‌లుక్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్ రిలీజ్ తర్వాత ఫ్యాన్స్ అంతా అభినందనలు చెప్తుంటే.. ఓ నెటిజన్ మాత్రం రానాపై సెటైర్ వేశాడు. ఆ నెటిజన్ రానా ఇచ్చిన ఇంటర్వ్యూని పోస్ట్ చేస్తూ  కామెంట్ పెట్టాడు. రానా ఆ ఇంటర్వ్యూలో 'నేను 10వ తరగతి ఫెయిల్ అయ్యాను. కానీ, ఆ రిజల్ట్స్ నా కలలు నెరవేర్చుకోకుండా ఆపలేకపోయాయి అన్నాడు.

 

దానికి నెటిజన్ నా ఎందుకంటే కుటుంబానికి పెద్ద ప్రొడక్షన్ కంపెనీ ఉంది' అని కామెంట్ పెట్టాడు. దానికి కౌంటర్ గా రానా.. అందులో ఏమీ లేదు బ్రో. మనం నటన అనే ఆర్ట్‌ని నేర్చుకోకపోతే వెనక ఎంత పెద్ద నిర్మాణ సంస్థ ఉన్నా వేస్టే. అంటూ బదులు ఇచ్చాడు.  అంతే నెటిజన్ నుంచి మళ్లీ సమాధానం రాలేదు. మొత్తానికి ఎంత బ్యాగ్ గ్రౌండ్ ఉన్న తన నటనలో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు సాగుతున్న రానాకి అభినందనలు తెలిపారు నెటిజన్లు. 

మరింత సమాచారం తెలుసుకోండి: