బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న రాజమౌళి ప్రస్తుతం మరో భారీ చిత్రాన్ని రూపొందించే పనిలో ఉన్నాడు. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ హీరోలుగా ఆర్ఆర్ఆర్‌ సినిమాను విజువల్‌ వండర్‌గా తెరకెక్కిస్తున్నాడు జక్కన్న. ఇప్పటికే ఈ సినిమా మీద టాలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీలలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా 400 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ సగానికి పైగా పూర్తయ్యింది.


ఇక మీడియా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రతీ అకేషన్‌కి అప్‌డేట్ వస్తుందన్న ప్రచారం జరుగుతున్నా ఆర్ఆర్‌ఆర్‌ టీం మాత్రం ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వకుండానే బండి లాగించేస్తున్నారు. దీంతో లీకులతోనే సరిపెట్టుకుంటున్నారు అభిమానులు. గతంలో సినిమాకు సంబంధించిన ప్రెస్‌ మీట్ నేపథ్యంలోనూ రాజమౌళి కేవలం ఆర్టిస్ట్‌ల విషయంలో క్లారిటీ ఇచ్చాడు గానీ కథా కథానలు పై స్పందించలేదు. ముఖ్యం గా సినిమాలో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ కాంబినేషన్‌ లో సీన్స్‌ ఉంటాయా లేదా అన్న విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. 


అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ జూనియర్ ఆర్టిస్ట్ ఆసక్తికర విషయాలను లీక్ చేశాడు. సినిమాలోని కీలక సన్నివేశాల గురించి ఆసక్తికర కామెంట్లు చేశాడు. ఇక సినిమాకే హైలెట్ అని భావిస్తున్న ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ల పోరాట సన్నివేశం గురించి కూడా హింట్ ఇచ్చాడు. ఇందులో అలాంటి సన్నివేశం ఉంటుందా అంటే నవ్వుతూనే ఊ అన్నట్లు సమాధానమిచ్చాడు. ఆ ఫైట్‌లో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ను కొడతాడంటూ అసలు విషయాన్ని లీక్‌ చేశాడు. ఫైట్‌లో ఎన్టీఆర్‌ కుర్తా పైజామాలో ఉంటే, చరణ్‌ బ్రిటీష్ డ్రెస్‌లో ఉంటాడని చెప్పాడు.


ఓ జూనియర్‌ ఆర్టిస్ట్ వల్ల ఇలాంటి ఇబ్బంది వస్తుందని ఆర్‌ఆర్‌ఆర్‌ టీం ఊహించలేదు. ఇప్పటికే వరుసగా లీక్‌ అవుతున్న ఫోటోలు, వీడియోలతో ఇబ్బంది పడుతున్న టీం ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. మరి ఈ లీకులపై జక్కన టీం ఎలా రియాక్ట్‌ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: