చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ ఇద్దరూ తమ పుత్ర రత్నాల సామర్థ్యం చూసి తీవ్ర నిరాశ చెందుతున్నారని ప్రస్తుతం జరుగుతున్న పరిమాణాలను బట్టి చూస్తే స్పష్టమవుతోంది.



కొన్ని సంవత్సరాల క్రితం నారా లోకేష్ రాజకీయాల్లోకి అడుగు పెట్టినప్పుడు అతడు చాలా తెలివి గలవాడని... ప్రజల సమస్యలను సులువుగా పరిష్కరిస్తాడని టీడీపీ అధినేత చంద్రబాబు గొప్పలు చెప్పాడు. దీంతో చంద్రబాబు తరువాత టిడిపి పార్టీని సమర్థవంతంగా లోకేష్ నడుపుతాడని అందరూ భావించారు. కానీ లోకేష్ ఎప్పుడైతే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడో అప్పుడు అతనికి తెలుగు భాష రాదని, అర్థవంతంగా వ్యాఖ్యానించలేడని తెలిసిపోయింది. ప్రజలను ఆకట్టుకోవాలంటే ఏ రాజకీయనాయకుడు కైనా వక్తృత్వ నైపుణ్యాలు తప్పనిసరిగా ఉండాలి. కానీ ఆ నైపుణ్యం అణువంతైనా లోకేష్ బాబుకి లేదు. దీంతో గత ఎన్నికలలో అతడు గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేసి.. ఘోరంగా పరాజయం చెందాడు. అప్పట్లో కేవలం నారా లోకేష్ కారణంగానే టీడీపీ పార్టీ పతనమైపోయిందని నెట్టింట ప్రచారం కూడా జరిగింది.


మరోవైపు చంద్రబాబు కుమారుడు లోకేష్ రాజకీయాల్లో బ్రహ్మాండంగా రాణిస్తాడని మొదటిలో ప్రజలు అనుకున్నట్టు... బాలకృష్ణ పుత్రుడు మోక్షజ్ఞ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతాడని చాలామంది భావించారు. కానీ అతడి ఫీజిక్ ని చూసిన తరువాత లోకేష్ రాజకీయ రంగంలో ఎలా రాణించలేకపోయాడో.. మోక్షజ్ఞ కూడా సినీరంగంలో రాణించలేడని ఎంతోమంది అభిప్రాయపడ్డారు. అలాగే నందమూరి అభిమానులు మోక్షజ్ఞ బాడీని చూసి అతడిపై పూర్తిగా ఆశలు వదిలేసుకున్నారు. ఇది ఆ నోట ఈ నోట పడి చివరికి బాలయ్యకు కూడా తెలిసింది. దీంతో చంద్రబాబు వారసత్వం లోకేష్ బాబు ఎలా అబాసుపాలు అయ్యాడో... మోక్షజ్ఞకి కూడా అదే పరిస్థితి వస్తుందని తెగ భయపడిపోతున్నారట.


అందుకే ఆకస్మాత్తుగా మోక్షజ్ఞని అమెరికాకి పంపించి పన్నెండు వారాల పాటు యాక్టింగుకు సంబంధించిన క్రాష్ కోర్స్ ని నేర్చుకోవాలని ఆయనకు బాలకృష్ణ చెప్పారట. అలాగే లోకేష్ బాబు లాంటి ఫిజిక్ ని కలిగి ఉన్న మోక్షజ్ఞ... తన బాడీని గట్టిగ మార్చేందుకు వ్యాయామ శిక్షణ పొందనున్నడని తెలుస్తోంది. ఏదేమైనా భవిష్యత్తులో చంద్రబాబు, బాలకృష్ణ కుమారులు తమ తండ్రులు తలెత్తుకునేలా చేస్తారో లేదో చూడాలిక.

మరింత సమాచారం తెలుసుకోండి: