తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య కాలాంలో చాలా మంది బాలీవుడ్ బ్యూటీలు ఎంట్రీ ఇచ్చారు.  తమ అందాల ఆరబోతతో కుర్రాళ్ల మనసు దోచారు. కానీ కేవలం గ్లామర్ కే పరిమితం అయిన ఈ అందాల భామలు తర్వాత సినీ అవకాశాలు దక్కించుకోలేకపోయారు.  ఈ నేపథ్యంలో క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన ‘కంచె’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది ప్రగ్యా జైస్వాల్.  ఈ చిత్రంలో అందమైన ఆమె ముఖం నుంచి పలు రకాల భావోద్వేగాలు చక్కగా పలికాయి. వయ్యారాలు ఒలికించడంతో పాటు హుందాతనాన్ని ప్రదర్శించి ప్రేక్షకులను అలరించింది ప్రగ్య.

 

‘కంచె’ చిత్రంలో జమీందార్ యువతి సీత పాత్రలో కనిపించి మెప్పించింది ప్రగ్యా జైస్వాల్. తన తొలి సినిమాకే నటిగా మంచి మార్కులు కొట్టేసింది.  ఆతర్వాత పలు సినిమాల్లో ఈ భామ గ్లామర్‌లో అంచెలంచెలుగా కంచెలు దాటేసింది. ఆ తరువాత గుంటూరోడు’, ‘నక్షత్రం’ వంటి చిత్రాలలో నటించింది.  అయితే ఈ రెండు చిత్రాలు కూడా ఈ అమ్మడికి పెద్దగా పేరు తీసుకు రాలేకపోయారు.  ఈ చిత్రాల్లో ఎంత గ్లామర్ షో చేసినా అమ్మడుకి ఆఫర్లు మాత్రం రాలేదు.  దీంతో ఈ అమ్మడు సోషల్ మీడియాని నమ్ముకుంది.  అయితే ప్రస్తుతం ప్రగ్యాజైస్వాల్‌కు పెద్దగా అవకాశాలు లేవు.

 

దీంతో హాట్ ఫొటోలతో ఫిల్మ్‌మేకర్స్ దృష్టిలో పడేందుకు ఈ బ్యూటీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ప్రగ్య ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాల్సిందే.  ఇక క్రియేటీవ్ డైరెక్టర్ కృష్ణ వంశి దర్శకత్వంలో వచ్చిన ‘నక్షత్రం’ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ బికినీ సిన్లు, విచ్చల విడి అందాల ఆరబోతతో రెచ్చిపోయింది.  కంచె చిత్రంలో ఎంత ట్రెడిషన్ గా కనిపించిందో.. నక్షత్రంలో ఓ రేంజ్ లో రెచ్చిపోయింది.  ఈ భామ గ్లామర్‌లో అంచెలంచెలుగా కంచెలు దాటేసింది.. కానీ ఫలితాలు మాత్రం తక్కువగానే వచ్చాయి.  ప్రస్తుతం తెలుగు, తమిళంలో మంచి అవకాశం కోసం ఎదురు చూస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: