నాగ చైతన్య.. మనకు ముందు ఎలా తెలుసు.. జోష్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు.. అట్టర్ ప్లాప్ అయ్యాడు.. మొదటి సినిమా చూసినప్పుడు ఇతను కూడా హీరో ఏ నా ? అనే డౌట్ వచ్చేలా చేశారు.. కానీ ఏం చేస్తాం.. నాగేశ్వర రావు మనవడు.. నాగార్జున కొడుకు అయ్యాడు.. ఇంకా అందరూ అతన్ని తప్పక చూడాల్సి వచ్చింది. 

 

ఇంకా ఫస్ట్ సినిమానే ప్లాప్ అయ్యింది.. ఇంకా ఇంతటితో చైతు బాబు సినీ కెరీర్ క్లోజ్ అని అందరూ అనుకున్నారు.. కానీ కాదు రెండో సినిమాతోనే నాగ చైతన్య కెరీర్ ప్రారంభమైంది. అప్పుడే సమంత ఎంటర్ అయ్యింది.. ఇంకా చైతు దిశ ఓ రేంజ్ లోకి మారిపోయింది.. నాగ చైతన్య రెండొవ సినిమా.. సమంత మొదటి సినిమా ఏమాయ చేశావే.  

      

ఈ సినిమాలో పరిచయమైనా సమంత.. మొదట మాములు స్నేహితురాలు అనే అనుకున్నారు.. సినిమాలో ప్రేమను ఓ రేంజ్ లో పండించారు.. కానీ అది సినిమా.. అందరూ కామన్ అనుకున్న సినీ లవ్ స్టోరీ అనుకున్న వీరి బంధం నిజ జీవితంలో నిజమైంది.. ఇద్దరు పీకల్లోతుల్లో ప్రేమలో పడ్డారు.. ఏమాయ చేసావే సినిమా తీసినప్పుడు ఇద్దరి లవ్ అద్భుతం.. అతనికి అదే మర్చిపోలేని అనుభూతి. 

 

ఇంకేముంది.. సినీ జీవితాన్ని చూసుకుంటూనే చట్టపట్టాలు ఏసుకొని తిరిగారు.. పెళ్ళికి ముందే కొన్ని సినీమాల్లో కలిసి నటించారు.. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం.. ఇంట్లో పెద్దలు కాదు అంటే మహేష్ బాబు - నమ్రతలా లేచిపోయి పెళ్లి చేసుకునేవారు.. కానీ వీరి అదృష్టం బాగుండి ఇంట్లో వారు కూడా ఓకే అనేశారు. ఇంకేముంది.. సినీ జీవితంను .. నిజ జీవితాన్ని ఇద్దరు కలిసి ఏలేస్తున్నారు.. ప్రస్తుతం ఇండీస్ట్రీలో అద్భుతమైన ప్రేమ జంట సమంత.. నాగ చైతన్యదే. 

మరింత సమాచారం తెలుసుకోండి: