టాలీవుడ్‌ టాప్‌ ప్రొడ్యూసర్‌ దిల్ రాజు పెళ్లి గురించి కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. దిల్ రాజు భార్య అనిత కొంత కాలం క్రితం గుండెపోటు తో మరణించారు. అయితే ఆ తరువాత దిల్‌ రాజు తన పెళ్లి గురించి ఎక్కడా స్పందించలేదు. సినిమాల తో బిజీగా ఉన్న దిల్ రాజు ఇటీవల రెండో పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా దిల్‌ రాజు పెళ్లి చేసుకోబోయే అమ్మాయిపై కూడా ఓ వార్త మీడియా సర్కిల్స్‌ లో హల్‌చల్‌ చేస్తోంది.

 

టాలీవుడ్‌ లో టాప్‌ హీరోయిన్‌ గా మంచి ఫాంలో ఉన్న ఓ బ్యూటీ దిల్ రాజును పెళ్లి చేసుకునేందుకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. సౌత్‌లో ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా ఉన్న ఈ భామ ప్రస్తుతం ఆచితూచి సినిమాలు చేస్తోంది. ఈ భామ దిల్ రాజును పెళ్ళి చేసుకునేందుకు ఓకె చెప్పిదని ఫిలిం నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఆ హీరోయిన్‌ ఇప్పటికే కమిట్‌ అయిన సినిమాలు ఉండటంతో కొంత సమయం అడిగినట్టు గా వార్తలు వినిపిస్తున్నాయి.

 

ఆమె కమిట్‌ అయిన సినిమాలు పూర్తయిన తరువాతే పెళ్లి చేసుకుందామని చెప్పినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం దిల్‌ రాజు కూడా వరుస సినిమాలు నిర్మిస్తూ బిజీ గా ఉన్నాడు. రాజ్‌ తరుణ్ లాంటి చిన్న హీరోలతో లో బడ్జెట్‌ సినిమాలు చేస్తూనే మహేష్ బాబు, పవన్‌ కళ్యాన్‌ లాంటి టాప్‌ స్టార్లతో సినిమాలుచేస్తున్నాడు. అంతేకాదు ఇటీవల బాలీవుడ్‌లోనూ నిర్మాతగా అడుగుపెట్టాడు.

 

తెలుగులో ఘనవిజయం సాదించిన జెర్సీ సినిమాను బాలీవుడ్‌లో నిర్మిస్తున్నాడు దిల్ రాజు. తెలుగులో నాని పోషించిన పాత్రను బాలీవుడ్‌ లో షాహిద్ కపూర్‌ పోషిస్తున్నాడు. అర్జున్‌ రెడ్డి సినిమాను బాలీవుడ్‌లో కబీర్‌ సింగ్‌ పేరుతో తెరకెక్కించిన షాహిద్‌ ఇప్పుడు జెర్సీ రీమేక్‌లోనూ ఆక్టటుకునేందుకు రెడీ అవుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: