ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన రేవతి ప్రస్తుతం తన ప్రాభవాన్ని కోల్పోయి ఇప్పుడు చిన్నచిన్న పాత్రలు చేయవలసిన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఇలాంటి పరిస్థితులలో విభిన్నమైన సినిమాలను తీసే దర్శకుడు ఉమామహేశ్వరరావు రేవతిని ఒక సీన్ కోసం 12 రాత్రులు వర్షంలో నిలబెట్టి ఒక సీన్ తీసిన విషయానికి సంబంధించిన వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. 


దర్శకుడు ఉమామహేశ్వరరావు పేరు వింటే చాల సంవత్సరాల క్రితం అతడు తీసిన ‘అంకురం’ సినిమా గుర్తుకు వస్తుంది. ఈ మూవీలో రేవతి ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీలోని ఆమె నటనకు అనేక అవార్డులు కూడ వచ్చాయి. అప్పట్లో విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ మూవీకి విమర్శకుల నుండి కూడ ప్రశంసలు లభించాయి.


ఇప్పుడు అదే దర్శకుడు ఇట్లు ‘అమ్మ’ పేరుతో ఒక భిన్నమైన సినిమాను తీస్తున్నాడు. ఈ మూవీలోను ప్రధాన పాత్రను సీనియర్ నటి రేవతి పోషిస్తోంది. మహిళ సమాజాన్ని తెలుసుకోవాలి తమ అభిప్రాయాల్ని గొంతెత్తి చెప్పాలన్న ప్రయత్నం చేసే ఒక మహిళ కథగా చెబుతున్నారు. ఒక అమ్మ ప్రయాణంగా ఈ సినిమాను అభివర్ణిస్తున్నారు. ఉరుములు మెరుపులుతో కూడిన వర్షం పడుతున్న రాత్రి అనే వాక్యంతో ఈ సినిమా కథ మొదలవుతుందని ఈ మూవీ దర్శకుడు అంటున్నాడు. 


ఆ ఒక్క సన్నివేశాన్ని షూట్ చేసేందుకు ఈ దర్శకుడు ఏకంగా 12 రాత్రులు తీసుకున్నాడని ప్రతిరోజు తనను వానలో నిలబెట్టి ఆ సీన్ ను తీసిన విషయాన్ని నటి రేవతి ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లీక్ చేసింది. ఈ ఒక్క అంశం చాలు నటి రేవతి తాను నటించే పాత్ర విషయంలో ఎలా ప్రాణం పెట్టి నటిస్తుందో సినిమా తీసే విషయంలో దర్శకుడు ఉమా మహేశ్వరరావు ఎంతలా కష్టపడి సినిమా తీస్తాడో అన్న విషయం అర్ధం అవుతుంది. అయితే ఇలాంటి వాస్తవిక సినిమాలను ఇప్పటి తరం ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారు అన్నదే సందేహం..

మరింత సమాచారం తెలుసుకోండి: