తండ్రికి తగ్గ తనయుడిగా, ఒక మంచి నటుడిగా.. అన్నిటికంటే మరీ ముఖ్యంగా.. తన తండ్రి స్టార్ స్టేటస్ని ఎప్పుడు కూడా తలకి ఎక్కించుకోని ఒక మంచి మనిషిగా... సినీ పరిశ్రమలో పేరు సంపాదించుకున్నాడు రామ్ చరణ్. మరి అంతటి మెగా పవర్ స్టార్కి కాబోయే భార్య పై.. అటు మెగా కుటుంబంలోనే కాకుండా.. ఇటు మెగా అభిమానుల్లో సైతం ఎన్నో అంచనాలు ఉండేవి. ఒకానొక టైం లో రామ్ చరణ్ ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడని.. నిశ్చితార్ధం కూడా రహస్యంగా జరిగిపోయిందని..ఇలా అనేక వార్తలు వచ్చాయి. 

 

అలాగే రామ్ చరణ్హీరోయిన్ ప్రేమలో పడ్డాడని కూడా వార్తలు వచ్చాయి. అలా కొందరి హీరోయిన్స్ పేర్లు కూడా అప్పట్లో చక్కర్లు కొట్టాయి. ఇక వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ, అపోలో హాస్పిటల్స్ ఎండీ ప్రతాప్ రెడ్డి మనవరాలు ఉపాసన కామినేని ... రామ్ చరణ్కి కాబోయే భార్య అంటూ.. ఇరు కుటుంబాల నుండి అధికారిక ప్రకటన ఒకటి వెలువడింది. ఇక ఈ ప్రకటన వచ్చిన తరువాత.. కొన్ని ఆసక్తికరమైన వార్తలు టీవీ ఛానల్స్లో హల్చల్ చేశాయి.  

 

ఉపాసన తండ్రి అనిల్ కామినేని.. తెలంగాణ ప్రాంతంలోని దోమకొండ రాజా వంశస్థుడు కావడంతో.. రామ్ చరణ్ ఒక రాకుమారిని పెళ్లాడనున్నారని కొన్ని పత్రికలు వార్తలు రాసాయి. ఉపాసన కుటుంబ సభ్యులు కూడా.. ఇదే క్రమంలో ఎప్పటినుండో శిథిలావస్థలో ఉన్న దోమకొండ గడీని శుభ్రం చేయించడం.. అలాగే అక్కడ పెళ్లి చేయడానికి వీలుగా ఏర్పాట్లు మొదలుపెట్టడం చేశారట. అయితే అతిథులు గడీకి రావడానికి అనేక ఇబ్బందులున్న కారణంగా.. వధు, వరుల నిశ్చితార్ధం, వివాహ వేడుకలని హైదరాబాద్కి షిఫ్ట్ చేశారు. 

 

తొలుత వీరిద్దరి ప్రేమని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడానికి కాస్త సంశయించారట. ఎందుకంటే ఈ రెండు కుటుంబాల మధ్య సారూపత్య కలిగిన అంశాలు చాలా తక్కువ. అలాగే పరిచయాలు కూడా అంతంతమాత్రమే అని టాక్. దీనితో ఈ ఇరు కుటుంబాల మధ్య ఉపాసన పిన్ని.. అలాగే అపోలో హాస్పిటల్స్ ఎండీలలో ఒకరైన సంగీత రెడ్డి మధ్యవర్తిత్వం చేశారట. ఆ విధంగా ఆమె వారి ప్రేమకథ ముందుకు సాగేందుకు తోడ్పాడ్డారట. ఇరు కుటుంబాలు ఈ పెళ్ళికి ఒప్పుకునేలా చేసిన క్రెడిట్ ఆమెకే దక్కుతుంది అంటుంటారు. ఒక ఇంటర్వ్యూలో సైతం ఉపాసన తన పిన్ని సంగీత రెడ్డి లేకపోతే.. తమ వివాహం జరగకపోయేది అని చెప్పడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: