తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది కమెడియన్లు ఉన్న విషయం తెలిసిందే.  అయితే ఇక్కడ ఉన్న కమెడియన్లు ఏ ఇండస్ట్రీలో కూడా లేరని.. అలాగే అందరి మద్య ఎంతో సఖ్యత.. సాన్నిహిత్యం ఉంటుందని అంటుంటారు.  పాత తరం కమెడియన్లు రేలంగి,రాజబాబు, పద్మనాభం, చలం ఇలా ఎంతో మంది తమదైన కామెడీతో అలరించారు.  ఆ తర్వాత బ్రహ్మానందం, సుధాకర్, వేణు మాధవ్, ఆలి లాంటి వారు తమ కామెడీతో అలరించారు.  ఈ మద్య వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిలతో పాటు జబర్ధస్త్ నుంచి కొంత మంది కమెడియన్లు గా రాణిస్తున్నారు.  ఇక సందీప్ వంగా దర్శకత్వంలో అర్జున్ రెడ్డి సినిమాతో కమెడియన్ గా పరిచయం అయిన రాహుల్ రామకృష్ణ వరుసగా ఇండస్ట్రీలో ఛాన్సులు దక్కించుకుంటూ మంచి ఫామ్ లో కొనసాగుతున్నాడు.

 

తెలంగాణ యాసలో తనదైన మానరీజంతో రామకృష్ణ మంచి కామెడీ పంచుతున్నారు.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు ఈ స్థానం దక్కడానికి ఎన్నో కష్టాలు పడ్డానని.. కాలేజ్ రోజులు పూర్తయిన తరువాత, ఇక ఇంట్లో వాళ్లను డబ్బులు అడగకూడదని అనుకున్నాను. అందుకోసం చిన్నాచితకా పనులు చాలా చేశాను.  ఒకదశలో ఈ రోజు పూట గడిస్తే చాలు.. రేపటి పరిస్థితి ఎలా? అని భయంతో గడిపేవాడినని అన్నారు.  అప్పట్లో రిపోర్టర్ గా .. ఫ్రీలాన్స్ రైటర్ గా పని చేశాను.  ఇదే క్రమంలో చిన్నగా ఫిలిం రంగం వైపు వెళ్లానని.. అదృష్టం కొద్ది ‘అర్జున్ రెడ్డి’ చిత్రంలో ఛాన్సు దక్కిందని అన్నారు.

 

విజయ్ దేవరకొండ స్నేహితుడిగా తన పర్ఫామెన్స్ కి మంచి ప్రశంసలు దక్కాయని.. అయితే అర్జున్ రెడ్డి చిత్రం తీసే సమయంలో సందీప్ వంగా అప్పుడప్పుడు టెన్షన్ కి లోను అవుతు ఉండేవారని అన్నారు. ఆయన తన కష్టాలను నాతో చెప్పుకునేవాడు. టెన్షన్ వద్దు .. అంతా మంచే జరుగుతుందని చెప్పేవాడిని. 'అర్జున్ రెడ్డి' సినిమా విడుదలైన తరువాత, ఆ రెస్పాన్స్ ను చూసి నేను షాక్ అయ్యాను. అర్జున్ రెడ్డి హిట్ తర్వాత నేను మల్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: