సినీ పరిశ్రమలో ఎంతో మంది సెలబ్స్ ప్రేమలో పడ్డ విషయం తెలిసిందే.  కొంత మంది పెద్దలను ఒప్పించి.. లేదంటే ఎదిరించి పెళ్లి చేసుకున్నారు.  తెలుగు, తమిళ, హిందీ, మళియాళ ఒక్క భాష కాదు అన్ని భాషల్లో ఇలా ప్రేమ వివాహాలు చేసుకున్న వారు ఉన్నారు.  అయితే కొంత మంది ప్రేమలో విఫలం అయిన వారు కూడా ఉన్నారు. అలాంటి ప్రేమ విఫలం పొందిన ఓ నటి కన్నీరు పెట్టుకొని కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఎవరా హీరోయిన్ అనుకుంటున్నారా? తెలుగులో కళ్యాణ్ రామ్ నటించిన 'కత్తి' సినిమాలో హీరోయిన్ గా నటించిన సనా ఖాన్.   ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని  'గగనం' సినిమాలో చిన్న పాత్ర పోషించింది. చాలా కాలంగా ఈ బ్యూటీ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ మెల్విన్ లూయిస్ తో డేటింగ్ లో ఉంది. తరచూ ఇద్దరూ కలిసి తీసుకున్న ఫోటోలను షేర్ చేస్తూ తమ ప్రేమ సంగతులను అభిమానులతో పంచుకునేవారు.

 

సనా అతన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిందట. కానీ అతను మరో అమ్మాయితో రాసలీలలు కొనసాగిస్తూ మోసం చేసాడు. ఈ విషయం కనిపెట్టిన సనా డిప్రషన్ లోకి వెళ్ళింది. తాను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పటికీ తాను ఇలా మోసం చేయడం భరించలేకపోయిందట.  తాజాగా మీడియాతో మాట్లాడుతూ నేను మెల్విన్తో విడిపోయిన మాట నిజమే. నేను అతన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. కానీ అతను మరో అమ్మాయితో తిరుగుతూ నన్ను మోసం చేసాడు.

 

అతను చేసిన మోసం నేను తట్టుకోలేక పోయానని కన్నీరు పెట్టుకుంది.  శారీరకంగా అతడికి బ్రేకప్ చెప్పినా.. తన మనసంతా ఇంకా అతడే ఉన్నాడని.. పెళ్లి చేసుకోవాలని భావిస్తే ఇప్పుడు తనను ఇలా మోసం చేస్తాడని కలలో కూడా ఊహించలేదని ఎమోషనల్ అయ్యారు.  ప్రియుడితో బ్రేకప్ చెప్పిన ఈ బ్యూటీ మళ్లీ సినిమాలపై ఫోకస్ చేస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: