కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణువర్ధన్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విరానికా రెడ్డి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి సోదరి అవుతుంది. జగన్ తాతగారైన రాజారెడ్డి చిన్న కుమారుడు సుధాకర్ రెడ్డి, విద్యా రెడ్డి దంపతులకు పుట్టిన కుమార్తె విరానికా. సో, ఈ విధంగా చూస్తే దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి విరానికాకి పెదనాన్న అవుతారు.


ఈ విషయాలను పక్కన పెడితే.. విరానికా అమెరికాలోనే పుట్టి పెరిగింది. ఆమెకు వీలు దొరికినప్పుడల్లా... హైదరాబాదులోని తన (తాత) తల్లి తండ్రి అయిన సిసి రెడ్డి వద్దకు వచ్చి సమయాన్ని గడిపేది. తన తల్లి విద్య రెడ్డికి సినీ పరిశ్రమ వ్యాపారం ఉండేది. అప్పుడప్పుడు విరానికా రెడ్డి కూడా తన తల్లి వ్యాపార పనులలో పాల్గొనేది. అయితే మంచు విష్ణు కూడా సినీ రంగంలోనే ఉన్నాడు కాబట్టి వీళ్ళిద్దరికీ ఓ సందర్భంలో పరిచయం ఏర్పడింది. ఆపై క్రమక్రమంగా విరానికా రెడ్డి మంచు విష్ణు పై మనసు పారేసుకుంది. అలాగే విరానికా మంచి మనస్తత్వం చూసిన మంచు విష్ణు కూడా ఆమెను ప్రేమించాడు.


తర్వాత తమ పెద్దలకు వారి ప్రేమ విషయం చెప్పగా... వాళ్లు కూడా వీళ్ళ ప్రేమను అంగీకరించి ప్రముఖుల సమక్షంలో అంగరంభవైభవంగా పెళ్లి చేశారు. 2009వ సంవత్సరంలో జరిగిన వారి పెళ్లిలో విరోనికా మంచు విష్ణుకి రూ.2.50 కోట్ల డైమండ్ రింగ్ ను బహుమానంగా ఇచ్చింది. ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి నిర్వహించిన వీరి పెళ్లి 76 దేశాలలో ప్రసారం కావడం గమనార్హం. 2009వ సంవత్సరం నుండి ఇప్పటివరకు వాళ్ళిద్దరి మధ్య చిన్నపాటి గొడవలు కూడా లేకుండా ఎంతో అన్యోన్యంగా తమ వివాహబంధాన్ని కొనసాగిస్తున్నారు. తమ వివాహ బంధంలో బాగా సంతోషమైన క్షణాలు ఏమిటని వారిని ప్రశ్నిస్తే... విరానికాకి ఇద్దరు కవల బాలికలు పుట్టిన రోజేనని వాళ్ళు చెబుతారు. ఆ తర్వాత ఈ దంపతులకు ఒక బాబు, ఒక పాప పుట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: