టాలీవుడ్ కి ముందుగా క్యారెక్టర్ నటుడిగా అక్కడక్కడా సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించిన యువ హీరో విజయ్ దేవరకొండ, ఆ తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లి చూపులు అనే సినిమా ద్వారా పూర్తి స్థాయి హీరోగా మారాడు. ఫస్ట్ మూవీతోనే బెస్ట్ హిట్ అందుకున్న విజయ్, ఆ తరువాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో మరొక సూపర్ డూపర్ హిట్ కొట్టి టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. ఆపై పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన గీత గోవిందం సినిమాతో మరొక హిట్ తన ఖాతాలో వేసుకున్న విజయ్, ఒక్కసారిగా స్టార్ హీరో క్రేజ్ ని పాపులారిటీ ని సంపాదించుకున్నాడు. 

 

అయితే ఆ తరువాత నుండి మొన్నటి వరకు మాత్రం ఆయన నటించిన సినిమాలేవీ కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక ప్రస్తుతం విజయ్ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా వరల్డ్ ఫేమస్ లవర్. రాశి ఖన్నా, ఇజా బెల్లె, క్యాథరీన్ థెరిస్సా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కేఏ వల్లభ నిర్మిస్తున్నాడు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ అన్ని కూడా సినిమాపై మంచి అంచనాలు ఏర్పరిచాయి. 

 

నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న ఈ సినిమా ప్రేమికుల దినోత్సవం రోజున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే వరుసగా అపజయాలు అందుకుంటున్న విజయ్, తన క్రేజ్ ని సరిగ్గా ఉపయోగించుకోలేక పోతున్నాడని, మంచి యూత్ ఫుల్ ఫీల్ ఉన్న ఈ వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ, అతడికి మళ్ళి హీరోగా మంచి బ్రేక్ ని ఇవ్వడం ఖాయం అని టాలీవుడ్ వర్గాల టాక్. అలానే సినిమా యూనిట్ కూడా సినిమా పై ఎంతో నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. మరి నిజంగానే ఈసారైనా విజయ్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: