మెగా బ్రదర్ నాగబాబు ఇటీవలె ఈటీవీలో ప్రసారమయ్యే  సూపర్ హిట్ కామెడీ షో జబర్దస్త్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఏడేళ్ళ జబర్ధస్త్ కామెడీ షో నుంచి నాగ‌బాబు త‌ప్పుకోవ‌డంతో హాట్ టాపిక్‌గా నిలిచింది. `మాటల్లేవ్.. మాట్లాడుకోడాల్లేవ్’.. అంటూ జబర్దస్త్ షో నుండి బయటకు వచ్చేసిన నాగబాబు జీ తెలుగులో ప్రసారమయ్యే అదిరింది షోకి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. నాగబాబుతో పాటు జబర్దస్ లో చేసిన కమిడయన్స్  చమ్మక్ చంద్ర, ఆర్పీ, ధనరాజ్, వేణులు అదిరింది షోకి టీం లీడర్స్‌గా  చేసారు. 

 

అయితే వాస్త‌వానికి ఈయ‌న‌కు ఈటీవీలో ఉన్నపుడు ఎలాంటి టెన్షన్స్ లేవు.. జబర్దస్త్ టాప్ కామెడీ షో కావడం.. రేటింగ్స్ కూడా అదిరిపోవడంతో ఎలాంటి బాధలు లేకుండా ఉన్నాడు. కాని, అదిరింది షో రేటింగ్స్ పరంగా ఏ మాత్రం అదరకపోగా.. నాగబాబు ఇమేజ్‌కు దెబ్బకొడుతుంది. నిజానికి అదిరింది షో జబర్దస్త్ కు డూప్లికేట్ అనే ఫీలింగ్ రాక మానదు. ఎందుకంటే అచ్చు గుద్దినట్లు ఈ షోలో జబర్దస్త్ ఫార్మాట్ ని ఫాలో అయిపోయారు. ఇదిలా ఉంటే.. టీవీ షోలు, సీరియల్స్‌కి టీఆర్పీ రేటింగ్స్ చాలా ముఖ్యం. అయితే, ఈ రేటింగ్స్‌లో  అదిరింది చాలా వెనుకబడి ఉంది. అసలు ఈ షోను పట్టించుకునేవారే లేరట. గతవారం జీ తెలుగులో ప్రసారమైన టాప్ ఐదు షోలలో అన్నీ సీరియల్సే ఉన్నాయి. 

 

ఈ ఛానెల్‌లో ప్రసారమయ్యే షోలలో ‘అదిరింది’ది రేటింగ్స్ పరంగా ఆఖరి స్థానం అని తెలిసింది. దీంతో ఈటీవీలో టాప్ రేటింగ్ షోగా కొనసాగుతోన్న జబర్దస్త్‌కు అదిరింది దరిదాపుల్లో కూడా లేదని అంటున్నారు. జనవరిలో జబర్దస్త్  షోకు 6.49 రేటింగ్ రాగా.. అదిరింది కామెడీ షోకు కేవలం 2.26 రేటింగ్ మాత్రమే వచ్చింది. ఇక అదిరింది షో వల్ల జీ ఛానెల్‌కు కలిసొచ్చింది ఏమీ లేదని ఇండస్ట్రీలో వినిపిస్తోన్న టాక్. ఛానెల్‌కు కష్టంగా మారిన ఈ షోను ఇక నడిపించలేమని యాజమాన్యం అంటోందట. మ‌రి అదిరింది షో ఆగిపోతే నాగబాబు పరిస్థితి ఏంటి అనేది అర్థంకాని ప‌రిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: