సెలబ్రటీ కపుల్స్‌ లో తమకంటూ ఒక ప్రత్యేకత కలిగిన జంటలలో ఒక జంట.. ఒకరు సినిమాలోని పాటలకు స్టెప్పులు వేయిస్తే.. మరొకరు ఆ స్టెప్పులు వేయించడానికి పాటలు పాడుతారు. ఆ జోడియే... డ్యాన్స్ మాస్టర్ రఘు & సింగర్ ప్రణవి. వాలంటెన్స్ డే సందర్భంగా వీరి ప్రేమ కథ గురించి తెలుసుకుందాం..  

 

 

మొదటగా వీరిరువురు జీ సినీ అవార్డ్స్ కార్యక్రమంలో తొలిసారిగా కలిసారట. అక్కడే తొలిసారిగా ప్రణవిని రఘు చూశాడు. ఇక ఆమె గుణగణాలు తనని బాగా ఆకర్షించడంతో.. తనతో స్నేహం చేసేందుకు మెల్లగా ప్రయత్నించాడు. కానీ అటువైపు నుండి పెద్దగా స్పందన రాలేదట. ఇక ఇది ఇలా కాదని రఘు మాస్టర్ ఆమెకు ప్రపోజ్ చేయాలనీ నిర్ణయించుకున్నాడు. తర్వాత తన పేరు బయటకి రాకుండా రఘు ప్రణవికి ఓ పెళ్లి ప్రపోజల్ పంపిచాడు. కానీ.. ప్రణవి మాత్రం అసలు ఆ ప్రపోసల్ ఎవరు పంపించారని కూడా తెలుసుకోకుండా తిరస్కరించింది. అయితే తర్వాత కొన్ని సందర్భాలలో ఈ విషయం గురించి వెల్లడించారు. అసలు ఆమెకి ఆ సమయంలో ప్రేమ, పెళ్లి లాంటి విషయాల పట్ల ఆసక్తి ఉండేది కాదని చెప్పడం జరిగింది. ఇక ఇలా పరోక్షంగా అడగడం కుదరడం లేదని భావించి..  కొద్దిరోజుల తరువాత ఆమెకి నేరుగానే తన ప్రేమని వ్యక్తం చేశాడు రఘు. దానికి ప్రణవి తన సమాధానంగా నాకు ఇష్టంలేదండి..! మీరు మీ ఇంట్లో చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకోండి.. అంటూ ఉచిత సలహాలు కూడా ఇచ్చిందట..

 


ప్రణవి తన ప్రేమని తిరస్కరించినందుకు కాస్త కోపాన్ని కూడా రఘు ప్రదర్శించాడట.. ఇంకా దీనితో రఘు.. కాస్త కలత చెందాడట. ఆ తర్వాత కొంత కాలం వీరి మధ్య గ్యాప్ రావడంతో.. ఎవరి కెరీర్‌ లో వాళ్ళు బిజీ అయిపోయారు. మళ్ళీ ఒక సంవత్సరం తరువాత తిరిగి రఘునే ఒక వాట్సాప్ కాల్ రికార్డింగ్ ద్వారా.. ప్రణవికి ప్రపోజ్ చేశాడట. అయితే ఈ సారి ప్రణవి మునుపటిలా కాకుండా.. అలాగే అటు 'సరే' అనకుండా..  సైలెంట్‌ గా ఉండిపోయింది. ఈ తరుణంలో వీరిద్దరి ప్రేమకి పరోక్షంగా.. ప్రణవి తల్లి కూడా సహకరించిందనే చెప్పాలి. ఆమె ఈ ఇద్దరితో మాట్లాడుతూ.. అటు కెరీర్‌ లో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ప్రణవిని.. అలాగే ప్రణవి ప్రేమ కోసం ఎదురు చూస్తున్న రఘుకి మధ్య సయోధ్య కుదిర్చి.. వీరిద్దరి ప్రేమకి ఆమె ఒక వంతెనలా నిలిచారు.

 


క్రమక్రమంగా రఘు ప్రేమని ప్రణవి అంగీకరించడం..  ఆ తరువాత వారి ప్రేమని ఇరు కుటుంబాలు ఆనందంగా సమ్మతించడంతో వీరిద్దరి వివాహం జరిగింది. బంధుమిత్రులు, ఆత్మీయుల మధ్య ఏప్రిల్ 21, 2016 తేదిన.. వీరి వివాహం జరిగింది. ఆ తర్వాత మార్చి 11, 2019 తేదిన వీరికి ఓ పాప పుట్టింది. ఇప్పుడు వీరి బంధం.. ఒక అందమైన కుటుంబంగా మారింది. ఇప్పటికి కూడా వీరిద్దరూ కలిసి ఏదైనా ప్రోగ్రాం లేదా షోలో పాల్గొంటే, తమ ప్రేమాయణం గురించి రకరకాలుగా చెబుతుంటారు. అలాగే ప్రణవికి రఘు వాట్సాప్ ద్వారా పంపిన ప్రపోజల్‌ ని సైతం.. ఒక షోలో వేసి అందరికి వినిపించడం జరిగింది. ఈ ప్రపోజల్ వింటే.. రఘు మాస్టర్ ఆ సమయంలో ఎలా ఫీల్ అవుతూ.. ఆ సందేశం పంపించాడన్నది స్పష్టంగా తెలుస్తుంది.

 


అసలు ఈ ఇద్దరి జర్నీని ఒక చూస్తే, ఒకరు తూర్పు.. మరొకరు పడమర అన్నట్లుగా ఉంటారట. అలాంటి ఈ ఇద్దరు ప్రేమలో పాడడం ఒకింత ఆశ్చర్యంగాను.. అదే సమయంలో ఆసక్తినీ రేకెత్తించిందని వారి సన్నిహితులు చెబుతుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: