టాలీవుడ్ సీనియర్ నటులు నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో గొప్ప గొప్ప సినిమాల్లో నటించి యాక్టర్ గా అత్యున్నత శిఖరాలు అధిరోహించినప్పటికీ, సెట్ లో ఎప్పుడూ ఒదిగి ఉంటారని, అలానే తన వద్దకు సాయం అర్దించి వచ్చిన వారికి కాదు, లేదనకుండా తనవంతుగా సాయం అందించడంలో ఎప్పుడూ ముందుంటారని ఎందరో సినిమా ప్రముఖులు ఇప్పటికీ కూడా చెప్తూ ఉంటారు. ఇక కృష్ణ, తన సెట్స్ లోని వారితో పాటు తనను కలుసుకోవడానికి వచ్చిన ఫ్యాన్స్ ని కూడా ఎంతో సాదరంగా ఆదరిస్తుంటారట.

 

ఇక కృష్ణ గొప్పతనం గురించి థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, ఒకరోజు తాను పద్మాలయ స్టూడియోలోకి వెళ్తున్న సమయంలో సీనియర్ నటుడు హరనాథ్, స్టూడియో బయట తనకు కనపడ్డారని, అప్పటికే ఆయన పరిస్థితి ఎంతో దయనీయంగా ఉందని, అటువంటి పరిస్థితుల్లో ఉన్న ఆయనను సెక్యూరిటీ సిబ్బంది స్టూడియో లోపలకు వెళ్ళడానికి అనుమతించకపోవడంతో తాను లోపలకు వెళ్లి కృష్ణకి హరనాథ్ గారు వచ్చారు, ఆయన పరిస్థితి ఇలా ఉంది అని చెప్పానని అన్నారు. అంతే అనుక్షణమే అది విన్న కృష్ణ, హరనాథ్ ని లోపలి పిలిపించి ముందుగా ఆయనకు కడుపునిండా భోజనం పెట్టించి, 

 

ఆపై ఆయన కుటుంబ ఆర్ధిక పరిస్థితుల గురించి విని ఎంతో చలించిపోయి కొంత డబ్బును అందించారట. ఆ ఒక్క ఘటన చాలు హీరోగానే కాక మానవత్వంలోను కృష్ణ నిజంగా సూపర్ స్టార్ అని చెప్పడానికి అంటూ మాట్లాడారు పృథ్వి. కేవలం ఇది ఒక్కటే కాదు, ఇటువంటి సహాయాలు కృష్ణ తన లైఫ్ లో ఎందరికో చేసారని, మంచితనం మానవత్వం మూర్తీభవించిన ఆయనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికీ కూడా అందుకే ఎంతో గొప్ప పేరుందని కొందరు సీనియర్ జర్నలిస్టులు కూడా అప్పుడప్పుడూ చెప్తూ ఉంటారు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: