టాలీవుడ్ కి కార్తికేయ గుమ్మకొండ హీరోగా తెరకెక్కిన ఆర్ఎక్స్ 100 అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పంజాబీ భామ పాయల్ రాజ్ పుత్. స్వతహాగా అక్కడి రాజ్ పుత్ ల వంశానికి చెందిన పాయల్ తొలుత చెన్న మేరేయ అనే పంజాబీ సినిమా ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక తెలుగులో ఆమె నటించిన తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న పాయల్, తన ఆకట్టుకునే అందం, అభినయంతో ప్రేక్షకుల నుండి మంచి పేరు సంపాదించడంతో పాటు ఎందరో ఫ్యాన్స్ ని కూడా సంపాదించుకుంది. ఇక ఆ తరువాత ఎన్టీఆర్ కథానాయకుడు, ఇటీవల వచ్చిన సీత సినిమాల్లో స్పెషల్ అపియరెన్స్ లు ఇచ్చిన పాయల్

 

ఆ తరువాత ఆర్డీఎక్స్ లవ్, వెంకీ మామ, డిస్కో రాజా సినిమాల ద్వారా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా వాటిలో వెంకీ మామ మంచి విజయాన్ని అందుకుని ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక తమిళ్ లో ప్రస్తుతం ఏంజెల్ అనే సినిమాలో నటిస్తున్న పాయల్, ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా పలు ఫోటోలు, పోస్టులు వంటివి షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి ఎప్పుడూ చేరువ అవుతూ ఉంటుంది .ఇకపోతే నిన్న ఒక్కసారిగా తన బాయ్ ఫ్రెండ్ ఈయనే అంటూ అతడితో దిగిన ఫోటోలను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. 

 

నాలోని లోపాలను కూడా లవ్ చేసే ఒకే ఒక పర్సన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు, అతనితో గడిపిన ప్రతి క్షణం చాలా సంతోషాన్నిస్తుంది. నా జీవితంలో హ్యాపీనెస్ ని, అలానే ప్రశాంతతను నువ్వు నింపినందుకు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. హ్యాపీ బర్త్ డే మేరె జాన్ అంటూ తన బాయ్ ఫ్రెండ్ కి బర్త్ డే విషెస్ చెప్తూ ట్వీట్ చేస్తూ అతడితో కలిసి దిగిన ఫోటోలు పోస్ట్ చేసింది పాయల్ రాజపుట్. ఇక ఆమె పోస్ట్ చేసిన ఈ ఫోటోలు వెనువెంటనే పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. నిన్నటివరకు నటించిన సినిమాల్లో తన హీరోలతో లవ్ అఫైర్స్ నడిపిన పాయల్, నేడు ఏకంగా రియల్ లైఫ్ బోయ్ ఫ్రెండ్ తో తన అఫైర్ ని గురించి చెప్పి ఇక్కడ దుకాణం తెరిచిందిగా అంటూ పలువురు నెటిజన్లు కొంత సరదాగా ఆమెపై కామెంట్స్ చేస్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: