టాలీవుడ్ కి ఇటీవల అక్కినేని ఫ్యామిలీ హీరోలు నటించిన మనం సినిమా సినిమా ద్వారా ఒక చిన్న క్యారెక్టర్ లో నటించి నటిగా ఎంట్రీ ఇచ్చింది రాశి ఖన్నా. స్వతహాగా ఢిల్లీ కి చెందిన రాశి, ముందుగా మద్రాస్ కేఫ్ అనే బాలీవుడ్ సినిమా ద్వారా చిత్ర పరిశ్రమకు నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఇక తెలుగులో మనం తరువాత శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో నాగ శౌర్య హీరోగా తెరకెక్కిన ఊహలు గుసగుసలాడే అనే సినిమాలో మంచి పాత్రలో నటించిన రాశి, ఆ సినిమా హిట్ అవడంతో మంచి పేరు దక్కించుకుంది. అక్కడినుండి ఆమెకు వరుసగా టాలీవుడ్ లో అవకాశాలు రాసాగాయి. 

 

ఇక ఇటీవల కొన్ని హిట్ సినిమాలతో పాటు మధ్యలో ఫ్లాప్స్ కూడా చూసిన రాశి, ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిన్న ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన రాశి, తన లవ్, అలానే బ్రేకప్ గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. తన లైఫ్ లో ప్రతి అమ్మాయి కూడా ఏదో ఒక సందర్భంలో ప్రేమలో పడుడటం సహజం. అయితే అటువంటి ప్రేమలన్నీ సక్సెస్ కావు, ఇక నేటి రోజుల్లో బ్రేకప్ లు అనేవి చాలా కామన్ అయిపోయాయని, 

 

ఇక నాకు కూడా రెండు బ్రేకప్ లు ఉన్నాయి అంటూ ఓపెన్ గా తన ప్రేమ వ్యవహారాలు, బ్రేకప్ ల గురించి షాకింగ్ గా చెప్పింది రాశి. ఇక ఈ సినిమాలోని తన క్యారెక్టర్ కు, తన రియల్ లైఫ్ క్యారెక్టర్ తో చాలా దగ్గర పోలికలు ఉన్నాయని చెప్పిన రాశి, సినిమాలో ఒక మంచి ఫీల్ ఉంటుందని, తప్పకుండా రేపు రిలీజ్ తరువాత సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని అంటోంది. ఇక రాశి చెప్పిన ఈ లవ్, బ్రేకప్ ల మ్యాటర్ తో ఒక్కసారిగా షాక్ అయిన ఆమె ఫ్యాన్స్, వామ్మో నువ్వు మాములు దానివి కాదుగా, అప్పుడే లవ్, బ్రేకప్ రెండూ కూడా కానిచ్చేసావా రాశి అంటూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పలువురు నెటిజన్లు సరదాగా ఆమెపై కామెంట్స్ చేస్తున్నారు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: