టాలీవుడ్ లో ఇప్పుడు పూజా హెగ్డే ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం జాన్. ఈ సినిమాలో డార్లింగ్ పక్కన పూజా హీరోయిన్ గా నటిస్తోంది. పీరియాడికల్ లవ్ స్టోరీగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తిన్నాడు. ఇక పూజా రీసెంట్ గా మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపుర్రములో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. ఈ సినిమాతో పూజా క్రేజ్ ఇంకా పెరిగిపోయింది. దాంతో ఇప్పుడు పూజా హెగ్డే గురించే అందరు మాట్లాడుకుంటున్నారు. అందరు హీరోలు పూజా నే కావాలని మేకర్స్ ని అడుగుతున్నారట.

 

అందులో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రంలో పూజా పేరు వినిపిస్తుందని గత కొన్ని రోజులుగా ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. పవర్ స్టార్ ప్రస్తుతం బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ లో నటిస్తున్నారు. వేణు శ్రీ రాం ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. నివేదా థామస్, అంజలి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారని సమాచారం. ఇక ఈ సినిమాకోసం నిర్మాత దిల్ రాజు పవన్ కళ్యాణ్ కి ప్రత్యేకంగా ఫ్లైట్ ఏర్పాటు చేశారు. భారీగా రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. ఈ సినిమాకి సమ్మర్ కి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

 

అయితే పూజా హెగ్డే పవన్ కళ్యాణ్ సినిమా చర్చల్లో ఉండగానే బాలీవుడ్ ని ఆఫర్ వచ్చిందని న్యూస్ ఒకటి బాగా వైరల్ అవుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలో నటించే ఛాన్ దక్కించుకుందని సమాచారం. ఈ ఆఫర్ తో పూజా కూడా పిచ్చ హ్యాపీగా ఉందట. ఎప్పుడెప్పుడు ముంబై ఫ్లైటెక్కుదామా అని చూస్తుందట. అయితే ఇప్పుడు ఇదే విషయం పూజా లైఫ్ ని డేంజర్ లో పడేస్తుందని టాలీవుడ్ లో టాక్ మొదలైంది. అంతేకాదు మళ్ళీ అదే పొరపాటు చేసి సినిమాలు లేక ఆవురావురంటూ చూస్తున్న పూజా ని టాలీవుడ్ అవకాశం ఇచ్చి ఆదుకుంటే ముందు చేసిన తప్పే మళ్ళీ చేసి గోతిలో పడబోతుందని మాట్లాడుకుంటున్నారు. వాస్తవంగా పూజా మొదటి సినిమా తెలుగులో చేసి హిట్ అందుకుంది. ఆ సినిమా తర్వాత తెలుగు సినిమాలు అవకాశం వస్తే కాదని బాలీవుడ్ సినిమాకి సైన్ చేసి రెండేళ్ళు ముంబై లో ఉండిపోయింది. అదే ఆ సమయంలో పూజా చేసిన పెద్ద తప్పు. మళ్ళీ ఇక్కడ పెద్ద సినిమాలు చర్చల దశలో ఉంటే కూడా బాలీవుడ్ కి వెళ్ళాలని చూస్తోంది. ఇక పూజాని ఆ దేవుడే కాపాడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: