టాలీవుడ్‌ లో ప్రస్తుతం ఒక వెలుగు వెలుగుతున్న స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఎన్.టి.ఆర్, రాం చరణ్, మహేష్ బాబు, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్స్ తీసి ఇండస్ట్రీలో ఎన్నో రికార్డ్స్ ని నెలకొల్పారు. ప్రస్తుతం ఈయన కల నెరవేరుకుంటున్నాడు. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా తీసే కల. ఇప్పుడు దిల్ రాజు పవన్ కళ్యాణ్ తో బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా పింక్ రీ మేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించిన పాత్రలో ఇక్కడ పవర్ స్టార్ నటిసున్నారు. ఇప్పటికే ఈ సినిమా భారీ అంచనాలు నెలకొన్నాయి. సమ్మర్ కి అంటే మే 15 న ఈ సినిమాని రిలీజ్ చేయాలని దిల్ రాజు పక్కాగా ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాతో పాటు దిల్ రాజు తెలుగులో నాని నటించిన జెర్సీ సినిమాను బాలీవుడ్‌లో నిర్మిస్తున్నారు. షాహిద్ కపూర్ నాని పాత్రను పోషిస్తున్నాడు. 

 

ఇక తాజాగా దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన జాను డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాకి భారీగా లాస్ అని తెలుస్తోంది. సమంత-శర్వానంద్ నటించిన జాను సినిమాని కోలీవుడ్ లో సక్సస్ అయిన 96 కి రీమేక్ గా తెరకెక్కించారు. ఈ సినిమాని దిల్ రాజు ఎంతో ఇష్టాడి రీమేక్ చేశారు. అయితే డైరెక్టర్ ప్రేం కుమార్ చేసిన కొన్ని తప్పుల వల్ల సినిమా భారీ ఫ్లా అయింది గాని లేదంటే మంచి హిట్ అవ్వాల్సిన సినిమా అని ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. 

 

ఇలాంటి కష్టతరమైన పరిస్థితుల్లో దిల్ రాజు కి సంబంధించిన వార్త ఒకటి బాగా వైరల్ అవుతోంది. అదే ఆయన రెండో పెళ్లి చేసుకోబోతున్నారని. దిల్ రాజు భార్య అనిత కొంత కాలం క్రితం గుండెపోటు తో మరణించారు. తన పేరు మీదే దిల్ రాజు సినిమాలు నిర్మిస్తున్నారు. అనిత అన్న పేరు రాజుగారికి జీవితమనే చెప్పాలి. అందుకే ప్రొడ్యూసర్ గా ఇంత స్టార్ డం ని సంపాదించారు. ఇన్ని భారీ ప్రాజెక్ట్స్ ని నిర్మించారు. అయితే ఇప్పుడు ఎక్కడ చూసిన ఆయన రెండవ పెళ్ళి గురించే ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు. ఇంట్లో వాళ్ళ ఒత్తిడి వల్లే రాజుగారు రెండవ పెళ్ళికి రెడీ అవుతున్నారని బాగా ప్రచారం జరుగుతోంది. 

 

కానీ ఈ విషయంలో ఇంతవరకు దిల్ రాజు స్పందించింది లేదు. మరి ఈ వార్త ఆయన చెవికి చేరిందో లేదో ..ఒకవేళ చేరినా ఎలాంటివన్ని జూజూబి అని వదిలేశారో తెలీదు. ఒకవేళ ఈపుడు గనక రాజుగారు నిజంగానే రెండవ పెళ్ళికి నిర్ణయం తీసుకుంటే మాత్రం ఇది ఆయన లైఫ్ కి ఒక టర్నింగ్ పాయింట అని ఒకరకంగా ఇది పెద్ద తప్పు చేసినట్టేనని దీనివల్ల నిర్మాతగా రాజుగారి లైఫ్ క్లోజ్ అని చాలామంది చెప్పుకుంటున్నారు. మరి ఈ విషయంలో రాజుగారు ఎప్పుడు స్పందిస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: