టాలీవుడ్ లో కొన్ని రోజులు హవా కొనసాగించిన కుర్ర హీరో వరుణ్ సందేశ్ గురించి తెలిసే ఉంటుంది. తెలీదు గుర్తు లేదనే ఛాన్సే లేదు. ఎందుకంటే మన రొమాంటిక్ హీరో .. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన హ్యాపీ డేస్ సినిమాతో టాలీవుడ్ లో బాగా ఫేమస్ అయ్యాడు. ఈ ఫేం తో కొత్త బంగారు లోకం సినిమాలోనటించి హిట్ అందుకున్నాడు. అయితే ఆ సినిమా తర్వాత చాలా సినిమాలు చేసినప్పటికి ఒక్కటి కూడా సూపర్ హిట్ అన్న మాట వినపడలేదు. అంతేకాదు ఆ తర్వాత కొన్ని ఘోరమైన ఫ్లాపులు పడ్డాయి. దాంతో ఈ కుర్ర హీరోకి టాలీవుడ్ లో ఏ మేకర్స్ ఛాన్స్ ఇవ్వలేదు. రేస్ లో వెనకబడిపోయిన వరుణ్ సందేశ్ కిందా మీదా పడి ఎట్టకేలకి ఒక సినిమాలో అవకాశం అందుకున్నాడు. 

 

అదే పడ్డానండి ప్రేమలో మరి. ఈ సినిమా ఏమో గాని నిజంగా ఈ సినిమా వల్లే వరుణ్ సందేశ్ వితికా తో ప్రేమలో పడ్డాడు. సినిమా అట్టర్ ఫ్లాపయినప్పటికి వీరిద్దరు మాత్రం పెళ్ళి చేసుకొని లైఫ్ లో సక్సస్ అయ్యారు. సినిమాలు లేకపోయినప్పటికి దాంపత్య జీవితంలో సంతోషంగా గడుపుతున్నారు. అలా ఫేడవుట్ అయి ఇంట్లో కూర్చున్న వరుణ్ కి లక్కీగా బిగ్ బాస్ సీజన్ 3 నుండి పిలుపొచ్చింది. అయితే ఒక్కడికి కాదు ఏకంగా భార్య భర్తలిద్దరికి. దాంతో మళ్ళీ వరుణ్ సందేశ్ అనే ఫేడవుట్ హీరో ఉన్నాడని అందరికి గుర్తొచ్చింది. ఈ షో తో మళ్ళీ వరుణ్ జనాలకి గుర్తు రావడంతో ఇప్పుడు ఏకంగా మేకర్స్ ని కాకా పట్టే పనిలో ఉన్నాడు. ఎవరైనా సినిమా ఛాన్స్ ఇస్తే నటిస్తానని తనకి తానే ఛాన్స్ అడుగుతున్నాడు. 

 

అయితే ఈ అయ్యగారు వరుస ఫ్లాపులతో బ్యాడ్ పొజిషన్ కి రావడమే కాదు. కొన్ని చెత్త పనులు కూడా చేశాడని అందువల్లనే కొంతమంది మేకర్స్ వరుణ్ ని పక్కన పెట్టారని చెప్పుకున్నారు. ముఖ్యంగా రెండు సినిమాలు హిట్ అవగానే బాగా ఫోజులు కొట్టాడని, రెమ్యూనరేషన్ ఇష్టమొచ్చినట్టు డిమాండ్ చేశాడని అప్పట్లో న్యూస్ బాగా వైరల్ అయింది. అంతేకాదు షూటింగ్ కి కూడా టైం కి రాకుండా ఇబ్బంది పెట్టేవాడట. ఇలాంటి వాటి వల్లే వరుణ్ సందేశ్ కెరీర్ గాడి తప్పిందట. అప్పుడేమో అన్ని ఇబ్బందులు పెట్టి ఇప్పుడు బిగ్ బాస్ లో కనిపించాక ఛాన్స్ లివ్వమని అడగడానికి కాస్తైనా సిగ్గుండాలి కదా అని ఫిల్మ్ నగర్ లో మాట్లాడుకుంటున్నారట. అయితే వాస్తవంగా ఈ బిహేవియర్ వరుణ్ భార్య వితికకి తెలీదు. ఎందుకంటే అప్పటికి వీళ్ళిద్దరికి పెళ్ళి అవలేదు కాబట్టి.

మరింత సమాచారం తెలుసుకోండి: