నటుడవ్వాలనే ఆసక్తి తో చిరంజీవి మద్రాస్ వెళ్ళి దేవదాస్ కనకాల గారి దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నారు. అలా శిక్షణ తీసుకున్న చిరంజీవికి ఒకే సంవత్సరం రెండు సినిమాలలో నటించే అవకాశం వచ్చింది. అవే పునాది రాళ్ళు, ప్రాణం ఖరీదు. అయితే 1978 లో ముందుగా ప్రాణం ఖరీదు, తర్వాత పునాది రాళ్ళు రిలీజయ్యాయి. ఆ రెండు సినిమాలలో చిరంజీవి నటనకు మంచి ప్రశంసలు దక్కడంతో ఇక ఇప్పటివరకు జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసబెట్టి సినిమా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అలాగే సినిమా సినిమాకి ప్రేక్షకుల్లో క్రేజ్ పెరిగిపోతూనే ఉంది.

 

ఈ క్రమంలోనే నటులు, తెలుగులో ఫేమస్ కమెడియన్ శ్రీ అల్లు రామలింగయ్య గారితో పరిచయం ఏర్పడింది. అలా చిరంజీవి నటన మీద రామలింగయ్యకి మంచి అభిప్రాయం ఉండేది. ఒక చిన్న సీన్ కోసమైనా చిరంజీవి పడే తపన, తాపత్రయం కళ్ళారా చూశారు అల్లు రామలింగయ్య గారు. ఆ అభిప్రాయం కాస్తా చిరంజీవి మీద ఇష్టంగా మారింది. అప్పటికే చిరంజీవి సోలో హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాలలో ఉన్నారు. ఇలాగే ఒకసారి ట్రైన్ లో పక్క పక్క కంపార్ట్మెంట్స్ లో ప్రయాణం చేస్తున్నారట... చిరంజీవి, రామలింగయ్య గారు. ఆ సమయంలో చిరంజీవికి రామలింగయ్య వైన్ ఆఫర్ చేశారట. అప్పుడే చిరంజీవి లోని ఆసక్తికరమైన విషయం రామలింగయ్య గారికి తెలిసింది.

 

అదేమిటంటే సినిమాలల్లో నటిస్తూ మంచి ఫాం లోకి వస్తున్న చిరంజీవికి వైన్ తీసుకునే అలవాటు లేకపోవడం. అది తెలుసుకొని రామలింగయ్య అవాక్కయ్యారట. అయినా సరే మళ్ళీ ఆఫర్ చేసి ట్రై చేశారట. అప్పుడు చిరంజీవి నిర్మొహమాటంగా వద్దని చెప్పడంతో ఆ క్షణం నుంచి చిరంజీవి గురించి ఆలోచించడం మొదలు పెట్టారట. అలా ఆలోచించిన చిరంజీవిలో సిగరెట్, మందు తీసుకునే అలావాటు లేకపోవడం సినిమా హీరో అయినా ఏ హీరోయిన్ తో ఎఫైర్స్ లేకపోవడం అల్లు రామలింగయ్య కుటుంబానికి బాగా నచ్చింది. దాంతో రామలింగయ్య తన కూతురు సురేఖ ని ఇచ్చి పెళ్ళి చేసుకోవాలనుకున్నారు. అలా అనుకున్నప్పటికి ఎవరికీ తెలీకుండా అల్లు అరవింద్ ఎంక్వైరీ చేసి అన్నివిధాలా చిరంజీవిలో గొప్ప క్వాలిటీస్ ఉన్నాయని .. అల్లు కుటుంబానికి 100 కి 100 శాతం చిరంజీవి సరైన వ్యక్తి అని అల్లుడిని చేసుకున్నారు. ఆ తర్వాత అల్లు అరవింద్ చిరంజీవితో వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలని నిర్మించి మెగాస్టార్ అయ్యోలా చేశారు. మొత్తానికి చిరంజీవిలో ఉన్న ఈ ఒక్క క్వాలిటీనే ఆయన్ని అల్లు ఫ్యామిలికి అల్లుడిని, ప్రేక్షకులకు మెగాస్టార్ ని చేసింది.      

మరింత సమాచారం తెలుసుకోండి: