ప్రేమలో పడటం, కొంతకాలం వారితో కలిసి అన్ని పంచుకోవడం. ఆ తర్వాత అతని గురించి తెలిసింది, ఇతను నన్ను మోసం చేసాడు, అతనికి లెక్కలేనన్ని బెడ్ రిలేషన్స్ ఉన్నాయని వాపోవడం. ఇప్పుడు సర్వసాధారణంగా వినిపిస్తున్న మాటలు.. ఇక సినిమా ఇండస్ట్రీలో అయితే ప్రేమ అంటే అర్ధమే మారిపోయింది. అదెలా అంటే ఇప్పుడు కొందరికి మాత్రం ప్రే అంటే ప్రేమించడం, మ అంటే మరచిపోవడం.. ఈ ట్రెండ్ ఫాలో చేస్తూ తూచ తప్పకుండా పాటించే వారున్నారు.

 

 

ఇలా లెక్క లేనన్ని ప్రేమలు నెరపిన హీరోయిన్స్ గానీ, హీరోలు గానీ టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అనే తేడా లేదు. ఈ రంగుల ప్రపంచంలో కూడా ఇలాంటి వారి మధ్య ఉన్న ప్రేమలు నిత్యం కొత్త కొత్త రంగులు మారుతున్నట్లుగా ప్రేమికులను మార్చడం సర్వసాధారణం అయిపోయింది. ఇకపోతే కళ్యాణ్ రామ్ కత్తి, గగనం, మిస్టర్ నూకయ్య చిత్రాల ద్వారా తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమైన బాలీవుడ్ నటి సనా ఖాన్ ఓ డాన్స్ మాస్టర్‌తో ప్రేమలో పడిన విషయం అందరికి తెలిసిందే.. ఒకగానొక సమయంలో ఈ విషయాన్ని అఫీషియల్‌గా వెల్లడిస్తూ ట్విట్టర్ ద్వారా ప్రకటన చేశారు. అతడితో దిగిన ఫోటోలను కూడా ఆ సందర్భంగా అభిమానులతో పంచుకున్నారు...

 

 

కానీ ఏమైందో ఏమో కానీ వీరికి ప్రేమ బోర్ కొట్టినట్లు ఉంది కావచ్చూ, ఇప్పుడు బ్రేకప్ అయ్యారు.. అదేమంటే  ఈ అమ్మడిని ఆ గురుడు మోసం చేశాడట. ఇకపోతే మెల్విన్ కు పలువురు అమ్మాయిలతో అఫైర్స్ ఉన్నాయని.. ఆ విషయం నేను ప్రత్యక్షంగా చూశానంటూ,  తాజాగా మీడియా ముందుకు వచ్చిన సనా అతడి గురించి ఇలాంటి షాకింగ్ విషయాలను బయట పెట్టి వాపోయింది.

 

 

అంతే కాకుండా అతడు నన్ను దారుణంగా మోసం చేశాడు. అలా జరగడంతో నేను డిప్రెషన్ లోకి వెళ్లి పోవడమే కాదు, అతడి కారణంగా నేను జీవితంలో చాలా నష్టపోయాను, అతనే నాకు సర్వస్వం అనుకున్నా, అందుకే అతడిని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను. కాని చాలా ఈజీగా నన్ను మోసం చేశాడు. నన్ను ప్రేమిస్తున్నట్లుగా చెబుతూనే అతడు ఇతర అమ్మాయిలతో బెడ్ రిలేషన్ ను కలిగి ఉన్నాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

 

 

ఇకపోతే ఇప్పుడిప్పుడే అతడి మోసం నుండి తేరుకుంటున్నట్లుగా తెలిపింది.. సమాజం మహా సముద్రం, ఇందులో తిమింగలాలతో పాటుగా మొసళ్లు కూడా ఉంటాయి. అందుకే చాలా జాగ్రత్తగా ముందుకు సాగాలి, కానీ వాటి నోటికి చిక్కాక ఇలా బాధపడి ఏం లాభం అంటున్నారట కొందరు...

మరింత సమాచారం తెలుసుకోండి: