యువ సామ్రాట్‌ నాగ చైతన్య, సాయి పల్లవి జంట గా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా  `లవ్ స్టోరీ`. మంచి కాఫీ లాంటి చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏమిగోస్  క్రియేషన్స్, సోనాలి నారంగ్  సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వరుసగా మజిలీ, వెంకీ మామ సినిమాల సక్సెస్‌లతో ఫుల్‌ ఫాంలో ఉన్న చైత ఈ సినిమాతో మరో సక్సెస్‌ మీద కన్నేశాడు.

 

ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్‌. సంక్రాంతి పండగ రోజు ఫస్ట్ లుక్ తో ఆకట్టుకున్న టీమ్ ఇప్పుడు ప్రేమికుల రోజున మరో సర్ ప్రైజ్ తో రాబోతుంది. మ్యూజికల్ లవ్ స్టోరీగా రాబోతున్న లవ్ స్టోరీ నుండి 1 మినిట్ మ్యూజికల్ ప్రివ్యూ రిలీజ్ చేయబోతున్నారు. అంటే ఫిబ్రవరి 14న ఉదయం 11గం.07 ని లకు సినిమాలోని మొదటి పాట ఏయ్ పిల్లా అనే సాంగ్ ప్రివ్యూ ని రిలీజ్ చేయబోతుంది. అందమైన ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్‌కు ఇదే పర్ఫెక్ట్ టైం అని ఫిక్స్‌ అయ్యారు చిత్రయూనిట్‌.

 

సంగీత సంచలనం ఎ.ఆర్ రెహామాన్ దగ్గర పనిచేసిన పవన్ సి.హెచ్ అందించిన స్వరాలు ఈ లవ్ స్టోరీని మరింత అందంగా మార్చబోతున్నాయని టీం చెబుతుంది. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న ఈ అందమైన ప్రేమకథ అక్కినేని అభిమనుల్లో, ప్రేక్షకుల్లో అమితాసక్తిని కలిగించింది. సెన్సిబుల్‌ ఎమోషన్స్‌ను బలంగా తెరమీద పలికించగల శేఖర్ కమ్ముల అందించబోతున్న ఈ ప్రేమకథ సమ్మర్ కి స్సెషల్ ఎట్రాక్షన్ గా మారబోతుంది. నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: