బాలీవుడ్‌ హీరోయిన్లు బోల్డ్‌ స్టేట్‌మెంట్‌లు ఇవ్వడం కొత్తేం కాదు. కానీ సౌత్‌ హీరోయిన్లు పెద్దగా అలాంటి కామెంట్స్‌ చేయరు. అయితే తెలుగు ఈ మధ్య రెండు సినిమాలు చేసిన ఓ బాలీవుడ్‌ బ్యూటీ, పెళ్లి లివింగ్‌ రిలేషన్‌ షిప్‌కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుత జనరేషన్‌లో పెళ్లికి ముందు ప్రేమ, డేటింగ్ లాంటి విషయాలు చాలా కామన్‌ అయిపోయాయి. బాలీవుడ్ లో అయిన దాదాపు సింగిల్స్‌ గా ఉన్నస్టార్స్‌ అంతా డేటింగ్‌లోనే ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.


ఈ విషయాల పై స్పందించిన భరత్‌ అనే నేను సినిమా ఫేం కియారా అద్వానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను ప్రస్తుతం సింగిల్‌ గానే ఉన్నానంటూ, ఎవరితోనూ ఏ రిలేషన్‌ షిప్‌లోనూ లేనంటూ క్లారిటీ ఇచ్చేసింది. అయితే లవ్‌ గురించి తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ.. ఒకసారి ఒకరితో రిలేషన్‌ షిప్‌ పెట్టుకుంటే ఆ రిలేషన్‌ జీవితాంతం కాపాడుకోవాలన్నది తన ఉద్దేశమన్న కియారా, తాను అలాంటి రిలేషన్‌ అయితేనే కమిట్ అవుతానని చెప్పింది. అంతేకాదు ఎవరినైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామో, ఎవరితో అయితే జీవితాంతం ఉండాలనుకుంటున్నామో వారితో డేటింగ్ చేయటం తప్పేమీ కాదన్నది తన అభిప్రాయమని చెప్పింది.


పెళ్లి వరకు వెళ్తాం అనుకున్నప్పుడు ముందుగానే అడ్వాన్స్‌ అవ్వటంతో తప్పలేదన్నది తన అభిప్రాయం అని బోల్డ్‌ స్టేట్‌ మెంట్ ఇచ్చేసింది ఈ బ్యూటీ. అయితే తాను మాత్రం ఇప్పట్లో ఎవరితో రిలేషన్‌ మెయిన్‌ చేయను అంటూ గట్టిగానే చెపుతోంది. ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాల మీదే ఉందన్న కియారా బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అంతేకాదు కథ డిమాండ్‌ చేస్తే ఎంత బోల్డ్‌ సీన్‌లో అయినా నటించేందుకు రెడీ అంటోంది. గతంలో ఈ భామ లస్ట్ స్టోరీస్‌ కోసం చేసిన ఓ క్యారెక్టర్‌ అప్పట్లో ఓ రేంజ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: