ఎన్టీఆర్ ప్రస్థుతం నటిస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ అతడి సినిమాలకు సంబంధించిన 29వ సినిమా. ఈ మూవీ తరువాత చేయబోయే తారక్ 30వ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించడానికి ఇప్పటికే ఒక ప్రాధమిక అంగీకారం కుదిరింది. వాస్తవానికి ఈ సినిమాను కళ్యాణ్ రామ్ తన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు.


అయితే తారక్ మాత్రం తన 30వ సినిమాను బయట బ్యానర్ లో చేసి ఆ తరువాత అతడు నటించబోయే 31వ సినిమా డేట్స్ ను కళ్యాణ్ రామ్ కు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ‘అసురన్’ మూవీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కు దర్శకత్వం వహించిన వేట్రిమారన్ కళ్యాణ్ రామ్ కు అడ్డు తగులుతున్నట్లు లేటెస్ట్ గా వార్తలు వస్తున్నాయి. 


తెలుస్తున్న సమాచారం మేరకు ఈమధ్య భాగ్యనగరం వచ్చిన వేట్రిమారన్ జూనియర్ ను కలిసి ఒక పవర్ ఫుల్ కథను చెప్పినట్లు సమాచారం. ఈ కథ బాగా నచ్చడంతో జూనియర్ ఈ స్టోరీ లైన్ ను డెవలప్ చేయమని తాను త్రివిక్రమ్ మూవీ తరువాత ఈ మూవీలో నటిస్తాను అని చెప్పినట్లు టాక్. అయితే కళ్యాణ్ రామ్ కు మాత్రం తాను జూనియర్ తో నిర్మించబోయే మూవీకి వేట్రిమారన్ దర్శకుడుగా ఉండటం ఇష్టం లేదనీ అందువల్ల తనకు త్రివిక్రమ్ తో జూనియర్ నటించబోయే మూవీ ప్రాజెక్ట్ కు నిర్మాతగా అవకాసం ఇవ్వవలసిందిగా ఒత్తిడి చేస్తున్నట్లు గాసిప్పులు హల్ చల్ చేస్తున్నాయి. 


అయితే తారక్ మాత్రం తాను నటించబోయే 30వ సినిమాకు నిర్మాతలుగా హారిక హాసిని సంస్థ కాని లేదంటే మైత్రీ మూవీస్ సంస్థకు కానీ అవకాశం ఇచ్చి తన 31వ మూవీని నిర్మించే అవకాశం కళ్యాణ్ రామ్ కు ఇవ్వాలని ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో కళ్యాణ్ రామ్ తన సొంత సినిమాను వేట్రిమారన్ తో తీయలేక తాను కోరుకున్న త్రివిక్రమ్ జూనియర్ ల కాంబినేషన్ కుదరక తెగ ఇబ్బంది పడుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో గాసిప్పులు గుప్పు మంటున్నాయి..    

 

మరింత సమాచారం తెలుసుకోండి: