తెలుగు దేశం పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఒడిపోయిన తర్వాత చాలా నిరాశలో కూరుకుపోయింది. ఎన్నో ఏళ్ళుగా బలమైన పునాదులు ఉన్న ఈ పార్టీకి అంత తక్కువ సీట్లు రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం 23 సీట్లే గెలుచుకుని పార్టీ వర్గాలని భయాందోళనలకి గురి చేసింది. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పార్టీ నిర్మాణాన్ని బలిష్టం చేసుకోవడానికి సిద్ధం అవుతోంది.

 

 

అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో మొదటిసారిగా ఎన్నికల నగారా మోగనుంది. మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో టిడీపీ తమ బలాన్ని చూపించడానికి సిద్ధం అవుతోంది. అందుకోసం ప్రత్యేక వ్యూహాలతో, సరికొత్త అస్త్రాలతో ముందుకు వస్తుంది. ముందుగా టీడీపీ అనుసరిస్తున్న విధానం జనాల్ని సమీకరించడం.

 

 

ఆంధ్రప్రదేశ్ లో కుల రాజకీయాలు చాలా ఎక్కువ అని అందరికీ తెలుసు.. సామాజిక వర్గాల వారిగా ఓటర్లు డివైడ్ అయిపోతుంటారు.  తెలంగాణలో ఈ రకమైన డివిజన్ చాలా తకువగా ఉంటుంది. ఇప్పుడు టీడీపీ ఈ అంశాన్ని బాగా వాడుకోవాలని చూస్తుంది. కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడు వంగవీటి రాధా రంగంలోకి దింపుతుంది. వంగవీటి రాధా ఒక సామాజిక వర్గాన్ని బలంగా ప్రభావితం చేయగలడు.

 

 

అటు పక్క హర్ష కుమార్ ని కూడా రంగంలోకి దింపుతుంది. మొన్నటికి మొన్న రావులపాలెం మీటింగ్ లో వీరిద్దరూ రావడం అందరిలో అనుమానాల్ని రేకెత్తించింది. అయితే ఆ అనుమానాలని నిజం చేస్తూ టీడీపీ పెద్ద వ్యూహాలనే రచిస్తోంది. స్థానిక సంస్థ ఎన్నికల్లో ఈ నాయకులని ముందు పెట్టి ప్రజల్లో గెలవాలని చాలా బలంగా ప్రయత్నిస్తోంది. స్థానిక సంస్థ ఎన్నికల్లో ఈ ఎత్తుగడ వర్కవుట్ అయ్యే అంశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఈ ఎత్తుగడ ఫలించి టీడీపీ మరలా పుంజుకుంటుందేమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: