భారతీయ చలన చిత్ర రంగంలో తన స్టైల్ తో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులు ఎగిరి గంతేసేలా ఉత్సాహ పరిచే నటుడు సూపర్ స్టార్ రజినీకాంత్.  నడక, మాట, కళ్లజోడు పెట్టుకోవడం.. గాల్లో సిగరేట్ ఎగరేసి నోట్లో వేసుకోవడం.. ఆయన నడక ఒక్కటేమిటి అన్నీ రజినీకాంత్ ఏది చేసిన సూపర్ సూపర్ అని చప్పట్లు కొట్టేవారు.   తెలుగు, హింది చిత్రాల్లో నటించిన ఆయన మొత్తానికి తమిళ నాటనే స్థిరపడ్డారు. వాస్తవానికి ఆయన మరాఠా అయినా తమిళుడుగానే ఉంటారు. ఈ నేపథ్యంలో ఆయన తమిళనాట నుంచి ఏ పోరాటమైనా చేస్తుంటారు. ఆ మద్య కర్ణాటక కావేరీ విషయంలో కూడా ఒక తమిళుడిగా పోరాటం చేశారు.

 

ఈ మద్య రాజకీయ నేతలు రాజకీయాల్లోకి వస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఎన్టీఆర్, ఎంజీఆర్ ల తర్వా  చిరంజీవి, పవన్ కళ్యాన్ లాంటివారు రాజకీయాల్లోకి వచ్చారు.  ఇప్పుడు తమిళనాట కమల్ హాసన్ రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం రాజకీయాాలపై కన్నెసినట్టు వార్తలు వస్తున్నాయి. అంతే కాదు గత కొంత కాలంగా ఆయన నటిస్తున్న సినిమాలు వరుసగా డిజాస్టర్స్ కావడం డిస్ట్రీ బ్యూటీర్లు రచ్చ చేయడం కామన్ అయ్యింది. నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్స్ సైతం నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ‘దర్బార్’ దెబ్బకు డిస్ట్రిబ్యూటర్స్ రోడ్డున పడ్డారు.

 

దర్శకుడు శివతో తాజాగా రజనీకాంత్ 168వ చిత్రం సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమైంది. సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  . ఇదంతాచూస్తుంటే రజనీకాంత్ కు గతంలో ఉన్న క్రేజ్ తగ్గినట్టే అనిపిస్తుంది. గతంలో రజనీ చిత్రం అంటే బయ్యర్లు పోటీపడి మరి తీసుకునేవారు. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనిపించడం లేదనే చెప్పాలి. మరి ఇలా ఫెయిల్యూర్స్ తో ఉన్నా రజినీలో ఏమాత్రం మార్పు లేదని అంటున్నారు. మరి ఆయన టార్గెట్ అంత భవిష్యత్ రాజకీయాల కోసేమే అయి ఉండొచ్చు అని కోలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: