అజిత్ హైద‌రాబాద్‌లో పుట్టి పెరిగి త‌మిళ‌నాడులో తిరుగులేని స్టార్ హీరోగా ఎదిగాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వ‌త‌హాగా త‌న క‌ష్టంతో అంత ఎత్తుకి ఎదిగాడు. ప్ర‌స్తుతం అజిత్ కి త‌మిళ్‌లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. గ్రేట్ డైరెక్ట‌ర్ మురుగుదాస్ వంటి ద‌ర్శ‌కుల‌కు లిఫ్ట్ ఇచ్చిన హానెస్ట్ హీరో అని చెప్పాలి. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది అతనికి ఇంత పెద్ద స్టార్ డ‌మ్ రావ‌డానికి అస‌లు కార‌ణం త‌న డైరెక్ట‌ర్లు, ప్రొడ్యూస‌ర్లు మాత్ర‌మే కాదు. హీరోయిన్ హీరా రాజ్‌గోపాల్‌. అవును. ప్రేమ‌లేఖ చిత్రంలో అజిత్‌ని ప్రేమించే భ‌గ్న ప్రేమికురాలిగా క‌నిపించే హీరో. తాను అప్ప‌టికే పెద్ద హీరోయిన్ కావ‌డంతో అజిత్‌కి అవ‌కాశాల కోసం తెలిసిన వారంద‌రి ద‌గ్గ‌రికి తీసుకెళ్ళి అజిత్‌ని ప‌రిచ‌యం చేసేది.

 

మ‌ధ్య‌లో వారిద్ద‌రి పై వ‌చ్చే గాసిప్స్‌కి స్పందిస్తూ త్వ‌ర‌లో హీరాను పెళ్ళి చేసుకోబోతున్న‌ట్లు తెలిపాడు. ఆ త‌ర్వాత స్టార్ హీరోగా మారే స‌మ‌యంలో షాలినితో ఒక చిత్రంలో న‌టించాడు అజిత్‌. ఆ సినిమా షూటింగ్ స‌మ‌యంలోనే ఆమెకు అట్రాక్ట్ అయి హీరాను దూరం పెడుతూ వ‌చ్చాడు. అజిత్ అప్పటికే అందానికి ఇకాన్ . నటుడి గా పేరు గడించాడు . ఈమె గుర్తింపు పొందిన బాలనటి . అనేకమంది ఇష్ట‌పడే నటి . వీరిద్దరూ కలిసి ' అమరక్కళం ' సినిమా పూర్తి చేసిన తర్వాత వారి ప్రేమ కధనం అంతా బయటకు వచ్చింది.

 

పత్రిక లో కవర్ పేజి కధనం వచ్చింది . కొద్దికాలానికే పెళ్లి జరిగింది . వారికున్న పెద్ద పాపులారిటీకి దూరం గా తమ వక్తిగత జీవితాన్ని వ్యక్తిగతం గానే ఉంచుకుంటున్నారు వీరిద్దరూ. ఇక ఇదంతా జ‌రిగినా కూడా హీరా మాత్రం ఎక్క‌డా బ‌య‌ట ప‌డ‌లేదు. అజిత్‌ని అల్ల‌రిపాలు చేయ‌లేదు. అంతేకాక ఆ రోజుల్లోనే కోటిరూపాయ‌లు ఎదురు క‌ట్నం ఇచ్చి మ‌రీ షాలినిని పెళ్ళి చేసుకున్నాడు. కానీ అజిత్ మాత్రం హీరో డ్ర‌గ్ ఎడిక్ట్ అని అందుకే ఆమెను చేసుకోలేద‌ని చెప్పుకొచ్చాడు. కాని ఆ విష‌యం పై హీరా స్పందించి అత‌ను చెప్పిందంతా ఆబ‌ద్ధం. న‌న్ను వ‌దిలించుకోవ‌డానికి చివ‌రికి న‌న్ను డ్ర‌గ్ ఎడిక్ట్ చేశాడ‌ని చివ‌రికి హీరా త‌న చాప్ట‌ర్ నుంచి అజిత్‌ను తుడిచేసింది. ఇక చివురికి ఆమె కూడా వేరే వాళ్ళ‌ను వివాహం చేసుకుని లైఫ్‌లో సెటిల్ అయింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: