ప్రస్తుతం యూత్ ఐకాన్ గా మారిపోయిన విజయ్ దేవరకొండకు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. లేటెస్ట్ గా ఈ మూవీకి సంబంధించి విశాఖపట్నంలో జరిగిన ఫంక్షన్ లో ‘రౌడీ హగ్’ అంటూ విజయ్ గాలిలోకి చేతులు చాపి హగ్ ఇమ్మని కోరుకుంటే ఆ ఫంక్షన్ కు వచ్చిన వేలాదిమంది యూత్ విజయ్ పిలుపుకు స్పందిస్తూ గాలిలోనే అతడికి హగ్ ఇవ్వడం చూసిన వారికి విజయ్ మ్యానియా నేటితరం ప్రేక్షకులలో ఏ రేంజ్ లో ఉందో అర్ధం అవుతుంది. 


రేపు విడుదల కాబోతున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీని ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ తన పెళ్ళి గురించి కొన్ని ఆశ్చర్యకర కామెంట్స్ చేసాడు. తనకు 30 సంవత్సరాలు వచ్చేయడంతో తన వయసు పెళ్ళిని కోరుకుంటూ ఉంటే తన మనసు మాత్రం పెళ్ళి వద్దు అంటూ ఒత్తిడి చేస్తున్న విషయాన్ని బయట పెట్టాడు. 


పెళ్ళి అంటే బరువు బాధ్యతలు అనీ ఇంకా తన కెరియర్ పూర్తిగా సెటిల్ కాని పరిస్థితులలో తాను ఖంగారుపడి పెళ్లి చేసుకుని పొరపాటు చేయకూడదు అన్న స్థిర నిర్ణయంలో ఉన్నట్లు క్లారిటీ ఇచ్చాడు. తాను చిన్నతనం నుండి విభిన్నంగా మాట్లాడటం అలవాటుచేసుకున్నానని అందువల్ల తనకు సెలెబ్రెటీ హోదా వచ్చినా తన అలవాట్లు పోవడం లేదు అంటూ కామెంట్ చేసాడు. 


విశాఖపట్నంలో జరిగిన ఈ మూవీ ఈవెంట్ లో తన లేటెస్ట్ మూవీ సక్సస్ అవుతుందా అవ్వదా అన్న విషయం తనకే తెలియదు అంటూ తన అభిమానులు మాత్రమే ఈ విషయాన్ని డిసైడ్ చేస్తారు అంటూ జోక్ చేసాడు. విజయ్ దేవరకొండకు సంబంధించి ఈ జోక్ సరదాగా ఉన్నా ఈ మూవీని కోట్లు పెట్టి కొనుక్కున్న బయ్యర్లకు మాత్రం విజయ్ మాటలు ఏమాత్రం రుచించవు. రేపు విడుదల కాబోతున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఫెయిల్ అయితే పూరి విజయ్మూవీ మార్కెట్ పై ఈ మూవీ పరాజయం తీవ్ర ప్రభావాన్ని చూపించే ఆస్కారం ఉంది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: