ఇండియన్‌ స్క్రీన్ మీద గ్లామర్‌కు పర్యాయపదంగా మారిన అందం రేఖ. బాలీవుడ్‌లో ఎంతో టాప్‌ స్టార్స్‌తో కలిసి నటించిన ఈ తెలుగమ్మాయి. తన పర్సనల్ లైఫ్‌ విషయంలో కూడా ఎన్నో వివాదాలకు కేంద్ర బింధువుగా మారింది. ముఖ్యంగా కెరీర్‌ స్టార్టింగ్‌ నుంచి వరుస ప్రేమలు ఆమె జీవితాన్ని, కెరీర్‌ను ఇబ్బందులో పడేశాయి. సుధీర్ఘ కెరీర్‌లో రేఖ చాలా మందితో ప్రేమలో పడింది. కొందరితో పెళ్లి పీటలు కూడా ఎక్కింది. కానీ ఏ బంధం కూడా ఎక్కువ కాలం నిలబడలేదు.

 

స్టార్ హీరోయిన్‌గా బాలీవుడ్‌ను ఏళుతున్న సమయంలోనే అప్పటి టాప్‌ స్టార్‌ జితేంద్రతో ప్రేమలో పడింది రేఖ. వీరిద్దరు కలిసి చాలా సినిమాల్లో నటించారు. జితేంద్రకు అప్పటికే చాలా మంది హీరోయిన్లతో ఎఫైర్లు ఉన్నట్టుగా రూమర్స్‌ ఉన్న రేఖ కూడా అతనితో ప్రేమలో పడింది. అంతేకాదు తనతో రిలేషన్‌ను చాలా సీరియస్‌గా తీసుకుంది రేఖ. అప్పటికే శోభా కపూర్‌తో జితేంద్రకు వివాహం అయి ఉడటంతో రేఖ, జితేంద్రల బంధం ముందుకు సాగలేదు.

 

బాలీవుడ్‌లో సార్ట్ విలన్‌గా ఉన్న జీవన్‌ కుమార్‌ కిరణ్ కుమార్‌తోనూ కొంతకాలం ప్రేమాయణం సాధించింది రేఖ. అయితే వారిద్దరు మధ్య కొద్ది రోజుల్లోనే ముగిసిపోయింది. ఆ తరువాత బాలీవుడ్ నటుడు వినోద్‌ మెహ్రను సీక్రెట్‌గా పెళ్లాడింది రేఖ. కొంత కాలం తరువాత వినోద్‌ రేఖను తన కుటుంబానికి పరిచయం చేయడానికి రేఖను కలకత్తా తీసుకెళ్లాడు. కానీ వినోద్‌ తల్లి వీరి ప్రేమను అంగీకరించకపోగా, రేఖను చెప్పుతో కొట్టే ప్రయత్నం చేసింది. దీంతో అక్కడే తన బంధాన్ని తెంచేసుకుంది రేఖ.

 

బాలీవుడ్‌ టాప్‌ స్టార్ అమితాబ్‌ బచ్చన్‌, రేఖల ప్రేమ అందరికీ తెలిసిందే. ఎన్నో సూపర్‌ హిట్ సినిమాల్లో కలిసి నటించిన ఈ జోడికి  ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. అయితే అప్పటికే అమితాబ్‌కు జయాతో వివాహం కూడా కావటంతో వీరి ప్రేమ మొగ్గగానే రాలిపోయింది. రేఖ, అమితాబ్‌లకు సంబంధించిన వార్తలు మీడియాలో రావటంతో జయా, అమితాబ్‌ రేఖలు కలవకుండా కట్టడి చేసినట్టుగా అప్పట్లో చాలా వార్తల వినిపించాయి.

 

చివరగా ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్త ముఖేష్‌ అగర్వాల్‌ను పెళ్లాడింది రేఖ. కేవలం నెల రోజుల ప్రేమలోనే ఒకరినొకరు అర్ధం చేసుకున్న ఇద్దరు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. రేఖతో వివాహం తరువాత ముఖేష్‌కు వ్యాపారాల్లో భారీ నష్టాలు రావటంతో ఆయన ఆత్మ హత్య చేసుకున్నారు. ఈ సంఘటన తరువాత రేఖ ఎవరికీ దగ్గర కాలేకపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: