తెలుగు ఇండస్ట్రీలో వారసత్వపు హీరోగా ‘లీడర్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు దగ్గుబాటి రానా.  మొదటి చిత్రం రాజకీయ కోణంలో వచ్చినా మనోడి పర్ఫామెన్స్ కి మంచి మార్కులే పడ్డాయి.  ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించిన రానా పెద్దగా పేరు సంపాదించలేక పోయాడు. కానీ హీరోగానే కాకుండా ఎలాంటి క్యారెక్టర్ అయినా తాను సిద్దం అనే కోణంలో వెళ్లాడు.  తెలుగు లోనే కాదు బాలీవుడ్ లో కి ఎంట్రీ ఇచ్చి అక్కడ సైతం డిఫరెంట్ క్యారెక్టర్స్ తో మెప్పించాడు.  తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించాడు రానా.  రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి, బాహుబలి 2 ’ చిత్రంలో భళ్లాల దేవగా ప్రతినాయకుడి పాత్రలో హీరో ప్రభాస్ కి పోటీగా నటించాడు.  ఈ చిత్రంలో ఇద్దరికీ మంచి పేరు వచ్చింది. 

 

జాతీయ స్థాయిలో ఈ ఇద్దరు నటులు తమకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నారు.  ఇక తేజ దర్శకత్వంలో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో హీరోగా తన పర్పామెన్స్ తో దుమ్మురేపాడు రానా.  తాజాగా రానా హీరోగా హిందీలో 'హాథీ మేరే సాథీ' రూపొందింది. తమిళంలో 'కాడన్' పేరుతో .. తెలుగులో 'అరణ్య' పేరుతో ఈ చిత్రం రిలీజ్ చేయనున్నారు. హిందీ వెర్షన్ కి సంబంధించిన టీజర్ ను నిన్న రిలీజ్ చేశారు. ఈరోస్ ఇంటెర్నేషనల్ వారు నిర్మించిన ఈ చిత్రానికి ప్రభు సాల్మన్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో రానా చాలా డిఫరెంట్ షేడ్ లో కనిపించనున్నట్లు తెలుస్తుంది.

 

అడవిలో పుట్టి ఏనుగులతో సహవాసం చేసిన ఒక యువకుడు కొంత మంది స్వార్థపరులు అడవిని నాశనం చేస్తూ.. అక్కడి జీవ రాసులను, ప్రకృతి వనరులను పూర్తిగా ధ్వంసం చేస్తున్న సమయంలో వాటిని కాపాడుకునే పనిలో పడ్డ యువకుడి పాత్రలో కనిపిస్తున్నారు. ఈ టీజర్ లో ఆయన లుక్ .. బాడీ లాంగ్వేజ్ కొత్తగా అనిపిస్తున్నాయి. తమిళ టీజర్ ను కూడా నిన్న సాయంత్రమే రిలీజ్ చేశారు. తెలుగు టీజర్ ను విడుదల చేయవలసి వుంది. ఈ మూడు భాషల్లోను ఈ  చిత్రాలను ఏప్రిల్ 2న రిలీజ్ చేసేందుకు సిద్దమవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: