ప్రస్తుతం టాలీవుడ్ లో రష్మిక మందన వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుని ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీగా ఉన్న హీరోయిన్లలో ఒకరిగా ఉన్నారు రష్మిక మందన. తనదైన నటనతో అందరినీ ఆకట్టుకుంటుంది ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. మొన్నటికి మొన్న సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ఛాన్స్ కొట్టేసి సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది రష్మిక మందన్న. కాగా ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో బిజీ బిజీగా ఉన్న హీరోయిన్లలో రష్మిక మందన ఒకరు. ఇక ఇప్పుడు అక్కినేని నాగేశ్వర రావు తో రష్మిక రొమాన్స్ చేయబోతుంది. అదేంటి అక్కినేని నాగేశ్వరరావు తో రొమాన్స్ చేయడం ఏంటి అని షాక్ అవుతున్నారా... ఇంతకీ ఈ స్టోరీ ఏంటో తెలుసుకుందాం రండి.ప్రస్తుతం వరుస సినిమాలతో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ దర్శకుడు తన సినిమాలతో టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ అని సృష్టిస్తున్నాడు.

 

 

 తీసినవి కొన్ని సినిమాలే అయినా సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు అనిల్ రావిపూడి. మొన్నటికి మొన్న సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమాను తెరకెక్కించి... సంచలన విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు అక్కినేని నాగచైతన్య కూడా ప్రస్తుతం మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నారు. కాగా అనిల్  రావిపూడి దర్శకత్వం లో నాగచైతన్య హీరోగా రష్మిక మందన హీరోయిన్గా త్వరలో  నాగేశ్వరరావు అని సినిమా తెరకెక్కుతుందని తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య తో రొమాన్స్ చేయబోతుంది రష్మిక. కాగా  ఈ ముగ్గురి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి అక్కినేని నాగేశ్వరరావు అనే టైటిల్స్  పెట్టినట్లు తెలుస్తోంది. అంటే ఈ సినిమాలు నాగచైతన్య  నాగేశ్వరరావు గా  నటించబోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: