టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి చెప్పాలంటే నిజంగా ఒక రోజు సరిపోదు. మన ఆంధ్ర లోని విజయవాడకు చెందిన వర్మ, సినిమాలపై అభిమానంతో యువకుడిగా ఉన్న సమయంలో కొందరు దర్శకుల దగ్గర అసిస్టెంట్ గా చేరి, ఆ తరువాత మెల్లగా దర్శకత్వంలో పలు మెళకువలు తెలుసుకుని ఆపై దర్శకుడిగా మారడం జరిగింది. తెలుగు తో పాటు బాలీవుడ్ లో కూడా పలువురు స్టార్ హీరోలతో ఎన్నో గొప్ప సినిమాలు తీసిన వర్మ, గతంతో పోలిస్తే ప్రస్తుతం మాత్రం సక్సెస్ లు ఇవ్వలేకపోతున్నారు. ఇక రామ్ గోపాల్ వర్మ జీవితంలో కూడా ఒక లవ్ స్టోరీ ఉందండోయి. అయితే అది వన్ సైడ్ లవ్ స్టోరీ మాత్రమే. 

 

ఇంతకీ ఆయన ప్రేమించింది మరెవరినో కాదు, దివంగత అతిలోక సుందరి శ్రీదేవిని. ఇక వర్మ ఎవరికైనా ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో శ్రీదేవి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన కళ్ళలో స్పార్క్ చూస్తే, ఆయన ఆమెను ఎంతగా ఇష్టపడ్డారో అర్ధం చేసుకోవచ్చు. అయితే తాను ఆమెను ప్రేమించింది పెళ్లి చేసుకుని భార్యగా చూసుకోవాలని కాదని, ఆమె తనకు దివి నుండి భువికి దిగివచ్చిన ఆరాధ్య దేవత అని అంటుంటారు వర్మ. 

 

ఇక ఆమెతో తాను సినిమాలు చేసినన్ని రోజులు తన కన్నులకు పండుగేనని, అలానే కొన్ని షాట్స్ అయిపోయిన తరువాత కూడా ఆమెనే తదేకంగా చూస్తూ ఉండిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని వర్మ అంటుంటారు. ఇక ఆమె బోనిని పెళ్లి చేసుకున్నప్పుడు ప్రేమికుడిగా కొంత తనకు బాధ కలిగినప్పటికీ, ఆమె మంచినే ఎప్పుడూ కోరుకునే వాడినని వర్మ చెప్పడం జరిగింది. ఇక ఇటీవల శ్రీదేవి మరణ వార్త విన్న తనకు విపరీతమైన షాక్ కలిగిందని, దేవతలకు కూడా మరణం ఉంటుందా అని తనకు అనిపించిందని ఇటీవల వర్మ ఒక ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ అన్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: